
ఆంధ్రప్రదేశ్:
► ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 439కి చేరింది.
► ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారినపడి కోలుకున్న 12 మంది డిశ్చార్జ్ కాగా, ఏడుగురు మరణించారు.
► కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 420గా ఉన్నాయి.
► నేటి నుంచి నూజివీడు పట్టణంలోని రెడ్‌జోన్ ప్రాంతంలో ఉన్నవారికి కరోనా వైరస్ పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నట్లు సబ్‌కలెక్టర్ స్వప్నిల్ పుండ్కర్ తెలిపారు.
గుంటూరు
► నేటి నుంచి సరి-బేసి విధానంలో లాక్‌డౌన్
► సరిసంఖ్య తేదీల్లోనే నిత్యావసర వస్తువుల కొనుగోలుకు అనుమతి
చిత్తూరు
► నేటి నుంచి రేషన్ కూపన్ల పంపిణీ కార్యక్రమం
► 16వ తేదీ నుంచి రేషన్ పంపిణీ
► చిత్తూరు జిల్లాలో ఏడు ప్రాంతాల్లో రెడ్ జోన్ ప్రకటన
► నిత్యావసర వస్తువులను ఇళ్లకే పంపుతున్న అధికారులు
తెలంగాణ:
► తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 592కు చేరింది.
► తెలంగాణలో కరోనాతో ఇప్పటివరకు 17 మంది మృతి చెందారు.
► మొత్తం 472 యాక్టివ్ కేసులు, 103 మంది డిశ్చార్జ్ అయ్యారు.
► నేడు బ్యాంకు ఖాతాల్లో రూ. 1,500
► సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని 74 లక్షల పేద కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో రూ. 1,500 జమ కానున్నాయని కేటీఆర్ వెల్లడించారు.
జాతీయం:
► దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10 వేలు దాటింది.
► దేశంలో కరోనాతో ఇప్పటివరకు 358 మంది మృతి చెందారు.
► కరోనా నుంచి 1,193 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
► నేడు లాక్‌డౌన్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం
► ఉదయం 10 గంటలకు మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.
► నేటితో 21 రోజుల దేశవ్యాప్త లాక్‌డౌన్ ముగియనున్న విషయం తెలిసిందే.
► రెండో దశ లాక్‌డౌన్‌లో కీలక మార్పులు.
అంతర్జాతీయం:
► ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19.23 లక్షలకు చేరింది.
► ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 1.19 లక్షల మంది మృతి చెందారు.
► ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి 4.43 లక్షల మంది కోలుకున్నారు.
► అమెరికాలో 5,86,377 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
► ఇప్పటివరకు అమెరికాలో కరోనాతో 23,610 మంది మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment