వరంగల్ (తాడ్వాయి): సూర్యుడి ప్రతాపానికి మరో యువకుడు బలైపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన రామారావు(25) అనే వ్యక్తి ఆదివారం వడదెబ్బతో మరణించాడు. ఆదివారం ఉదయం తోటి వారితో కలిసి తుంటాకు సేకరణకు సమీప అడవికి వెళ్లాడు. తుంటాకు సేకరిస్తుండగా వడదెబ్బ తగిలి అక్కడిక్కడే మరణించాడు.