ఆత్మకూరు(ఎస్) మండలం బోరింగ్‌తండా వద్ద ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రమాదవశాత్తూ బైక్‌పై నుంచి పడి ఓ వ్యక్తి మరణించాడు.
నల్గొండ(ఆత్మకూరు(ఎస్)): ఆత్మకూరు(ఎస్) మండలం బోరింగ్‌తండా వద్ద ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రమాదవశాత్తూ బైక్‌పై నుంచి పడి ఓ వ్యక్తి మరణించాడు. మరణించిన వ్యక్తి సూర్యాపేట మండలం చింతలచెరువు గ్రామానికి చెందిన బొజ్జ రాందాస్(40)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.