కేసీఆర్ అబద్ధాలకోరు
- హెల్త్ వర్సిటీ తేకుంటే జిల్లాలో తిరగనివ్వం
- ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ
నయీంనగర్ : ‘కేసీఆర్ అబద్ధాలకోరు.. గతంలో ఎన్నో హామీలు ఇచ్చాడు.. ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదు.. ఆయన లాంటి వారు మరొకరు లేరు.. తనకు అబద్ధా లు చెప్పడం రాదనడం ఆశ్చర్యంగా ఉంది’.. అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. అణగారిన వర్గా ల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని హెచ్చరించారు. ఆయన ఆదివారం హన్మకొండ నయీంనగర్‌లోని శ్రీసూర్య హైస్కూల్‌లో విలేకరులతో మాట్లాడారు.
డిప్యూటి సీఎం తాటికొండ రాజయ్యను పదవి నుంచి తప్పించడానికి కేసీఆర్ కుట్రలు చేస్తున్నాడనడానికి కాళోజీ జయంతి సభలో ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. నిండు సభలో రాజయ్యను అవమానించి తన దొరతనాన్ని నిరూపించుకున్నాడని చెప్పారు. శాఖలకు, ప్రాంతాలకు సంబంధం లేకుండా కేసీఆర్ అల్లుడు హరీష్‌రావు, కొడుకు కేటీఆర్, కూతురు కవిత హామీ లు ఇస్తుండగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా రాజయ్య హెల్త్‌యూనివర్సిటీ హామీ ఇవ్వడంలో తప్పేముందని ప్రశ్నించారు.
మంత్రి గా ఆయనకు నిర్ణాయాధి కారాలు లేకుండా చేస్తున్నాడని ఆరోపించారు. వరంగల్‌లో వైద్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పా టు చేయకుంటే కేసీఆర్‌ను జిల్లాలో తిరగనివ్వమని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ అవస రం లేదన్న శ్రీహరి, రాజయ్య వ్యాఖ్యలు వారి చేతగాని తనానికి నిదర్శనమని పేర్కొన్నారు. సమావేశంలో మందకుమార్ మాదిగ, తిప్పారపు లక్ష్మణ్‌మాదిగ, పుట్ట రవి, ప్రదీప్, యాక య్య, దయాకర్, వీరన్న పాల్గొన్నారు.