లింగంపేట: నిజామాబాద్ జిల్లా లింగంపేట తహశీల్దారు కార్యాలయంలో పట్టాదారు పాస్‌పుస్తకాలు మాయమైన వ్యవహారంలో మండల రెవిన్యూ ఇన్‌స్పెక్టర్ రేఖను బుధవారం పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అయితే గతంలో పట్టుబడిన ఫోర్జరీ పట్టాదారు పాసు పుస్తకాలను మండల కార్యాలయంలో ఉంచారు. అవి కనిపించకుండా పోవటంపై రెండు నెలల క్రితం ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
భద్రపరిచిన పాసుపుస్తకాలు గత ఏడాదిలో తహసీల్ కార్యాలయం నుండి మాయమయ్యాయి.సుమారు 80కి పైగా పట్టాపాసు పుస్తకాలు మాయమైనట్లు గత ఏడాది ఆగస్టు 29న ‘పాస్‌పుస్తకాలు మాయం’ అనే శీర్షికన సాక్షి ప్రచురించిన కథనానికి జిల్లా రెవెన్యూ యంత్రాంగం స్పందించింది. ఈ వ్యవహారం గురించి అప్పటి కామారెడ్డి ఆర్డీఓ వెంకటేశ్వర్లు లింగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారుు. ఆర్డీఓ ిఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు పాసుపుస్తకాలు మాయం కావడానికి అప్పటి తహసీల్దార్( ప్రస్తుత బిచ్కుంద తహసీల్దార్) దన్వాల్, లింగంపేట మండల ఆర్‌ఐ రేఖ బాధ్యులని పేర్కోంటూ ఇద్దరిపై కేసునమోదు చేసారు. ఈరోజు ఆర్‌ఐ రేఖను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. దన్వాల్‌ను త్వరలో అరెస్ట్ చేస్తామనీ ఎస్‌ఐ చెప్పారు.