సాక్షి,వరంగల్: కొత్త ఓటర్ల వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకునే వారి వివరాలు సైతం ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో పొందుపర్చనుంది. ప్రస్తుతం పాత ఓటర్ల వివరాలే సైట్‌లో అందుబాటులో ఉండగా.. కొత్త ఓటర్ల వివరాలు మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి వస్తాయి. గతంలో ఓటు వినియోగించుకుని జాబితాలో పేరు ఉందో లేదో చూసుకోవాలనుకునేవారు ఆన్‌లైన్ ద్వారా చూసుకునే వీలుంది. అయితే.. ప్రస్తుతం ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో పాత జాబితాకు సంబంధించిన ఓటర్ల వివరాలు మాత్రమే చూసుకునే వీలుంది. సంఘం అధికారులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు వెబ్‌సైట్‌లో కొత్త సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసే పనిలో నిమగ్నమయ్యారని అధికారులు చెబుతున్నారు. మరి కొద్ది రోజుల్లో కొత్త ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో పొందుపర్చనుంది.
కొత్త ఓటు నమోదుకు ఈ నెల 11 వరకు అవకాశం
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయాలనుకునే వారికి ఎన్నికల సంఘం మరో అవకాశమిచ్చింది. నవంబర్ 11 వరకు ఓటు నమోదుకు అవకాశం కల్పిస్తూ వెసులుబాటు ఇచ్చింది. నవంబర్ 12 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుండగా అంతకు ముందు ఒక రోజు వరకు దరఖాస్తులను అధికారులు స్వీకరిస్తారు. ఓటు నమోదు దరఖాస్తు నిరంతర ప్రక్రియ అయినా.. వచ్చే డిసెంబర్ 7న ఓటు వేసేందుకు వీలుగా ఈ నెల 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. 2018 జనవరి ఒకటి నాటికి 18 సంవత్సరాల వయసు నిండిన వారు ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మానుకోట నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కంటే ఈ సారి ఓటర్ల సంఖ్య పెరిగింది. గత ఎన్నికల్లో 2,16,685 మంది ఓటర్లు ఉండగా ప్రస్తుతం 2,11,688కి చేరారు. నియోజకవర్గంలో మహిళా ఓటర్లే కీలకంగా ఉన్నారు. గెలుపోటముల్లో గిరిజన ఓట్లు కీలకంగా మారనున్నాయి. ఇప్పటివరకు నియోజకవర్గం నుంచి గెలిచిన వారికి ఒక్కరికి కూడా రాష్ట్ర మంత్రి పదవి దక్కలేదు. సికింద్రాబాద్–విజయవాడ రైల్వేలేన్‌లో ముఖ్యõ Ü్టషన్‌గా మహబూబాబాద్ నియోజకవర్గం రూపాంతరం చెందుతూ వస్తోంది. మొదటి ద్విసభ్య నియోజకవర్గంగా, పార్లమెంట్ స్థానంగా ఉన్న మహబూబాబాద్ తర్వాత ఏకసభ్య నియోజకవర్గంగా మారింది. మళ్లీ 2009 పునర్విభజనలో మానుకోట ఎంపీ స్థానంగా ఏర్పడడంతో పాటు అసెంబ్లీ స్థానం ఎస్టీలకు రిజర్వైంది. 1994 నుంచి కొత్త అభ్యర్థులు గెలవడం పరిపాటిగా మారిన మానుకోట ప్రత్యేకతలకు నెలవుగా మారింది.
గిరిజనులదే ఆధిక్యత మహిళా ఓటర్లదే హవా గత ఎన్నికల కంటే తగ్గిన ఓటర్ల సంఖ్య చిల్లంచెర్ల నియోజకవర్గం నుంచి మానుకోటగా రూపాంతరం వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం మహబూబాబాద్‌కు దక్కని రాష్ట్ర మంత్రి పదవి తొర్రూరు రూరల్(పాలకుర్తి): సామాన్యుడి చేతిలో ఓటు వజ్రాయుధం. నేతల తల రాతలు మార్చాలన్నా.. నచ్చిన నాయకుడిని ఎంచుకోవాలన్నా ఓటే మూలం. ఐదేళ్లపాటు పీఠంపై ఉండే పాలకులను ఎన్నుకునేందుకు ఇది సువర్ణావకాశం. ఈ క్రతువులో దిగ్విజయంగా పాల్గొనాలంటే ఓటరు జాబితాలో పేరు ఉండాల్సిందే.
ఇన్నాళ్లు పోలింగ్ కేంద్రానికి వెళ్లి పేజీలకు పేజీలు తిరగేసి జాబితాలో పేరు చూసుకునేందుకు కష్టాలు పడాల్సి వచ్చేది. యువకులు వీలున్నా వెళ్లలేక పోతుండగా, వృద్ధుల పరిస్థితి ఇబ్బందిగా ఉండేది. కేంద్రాల వద్ద విధులు నిర్వర్తించే సిబ్బంది.. అక్కడికి వచ్చే వారికి సమాధానం చెప్పలేక కోపగించుకున్న సందర్భాలు సైతం ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంటి పట్టునే ఉండి జాబితాను సరిచూసుకు అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. పేరు, పోలింగ్ కేంద్రం, చిరునామా వంటి వివరాలన్నింటినీ ఇంటి వద్దే ఉంటూ తెలుసుకోవచ్చే. ఎలా అంటారా.. మీరే చదవండి.
పోలింగ్ కేంద్రానికి వెళ్లకుండానే ఓటు ఎక్కడుందో చూసే వీలుఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో వివరాలుకొత్త ఓటు నమోదుకు ఈ నెల 11 వరకు అవకాశం ఉంది. గూగుల్ సెర్చ్‌లోకి వెళ్లి
వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన వెబ్ పేజీ కనిపిస్తుంది. సెర్చ్ యువర్ నేమ్ అనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. అసెంబ్లీ నియోజకవర్గం, కౌన్సిల్ నియోజకవర్గం అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో మొదటి దాన్ని ఎంపిక చేసుకోవాలి. ఒక వేళ వెబ్ పేజీ హిందీ భాషలో ఉంటే వెబ్‌పేజీ పై భాగంలో ట్రాన్స్‌లేట్ ఆప్షన్‌ను ఎంపిక చేస్తే ఇంగ్లిష్ భాషలోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత కంటిన్యూ బటన్ క్లిక్ చేయాలి.తర్వాత పేజీలో మీ పేరు, తండ్రి, భర్త పేరు, వయసు, రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం ఇలా ఒకటి తర్వాత ఒకటి ఎంపిక చేసుకోవాలి. వివరాలన్నీ నింపిన తర్వాత వెబ్‌పేజీకి కుడివైపు కింద భాగంలో చప్టా(అల్ఫాబెట్స్, అంకెలతో ఉంటుంది)ను నమోదు చేయాలి. చివరగా సెర్చ్ బటన్‌ను క్లిక్ చేయాలి. వెంటనే మీరు పైన నింపిన వివరాలతో పాటు మీ ఓటరు సంఖ్య, ఓటు వేయాల్సిన పోలింగ్ కేంద్రం చిరునామాలు సులువుగా తెలిసిపోతాయి.
అప్పుడు.. ఇప్పుడు
2009 నియోజకవర్గాల పునర్విభజనలో మహబూబాబాద్ నియోజకవర్గంలో చాలా మార్పులు జరిగాయి. పునర్విభజనకు ముందు గూడూరు మండలంలోని కొన్ని గ్రామాలు మహబూబాబాద్ నియోజకవర్గంలో, మరికొన్ని గ్రామాలు నర్సంపేటలో ఉండేవి. నెల్లికుదురు మండలంలోని ఏడు గ్రామాలు అప్పటి చెన్నూరు నియోజకవర్గంలో, మిగిలినవి మానుకోట నియోజకవర్గంలో ఉన్నాయి. మహబూబాబాద్ మండలంలోని ఆరు గ్రామాలు డోర్నకల్ నియోజకవర్గంలో ఉన్నాయి.
పునర్విభజనతో...
పునర్విభజనలో గతంలో మాదిరిగానే కేసముద్రం మండలాన్ని యధావిధిగా కొనసాగిస్తూ గూడూరు, నెల్లికుదురు, మహబూబాబాద్ మండలాలను పూర్తిగా కలిపి నియోజకవర్గాన్ని ఎస్టీకి రిజర్వు చేశారు. 2014 ఎన్నికల్లో 2లక్షల 16వేల 685 మంది ఓటర్లు ఉండగా ప్రస్తుతం 2లక్షల 11వేల 688 ఓటర్లు ఉన్నారు. లక్షా 5వేల 254 మంది పురుషులు, లక్షా 5వేల 809 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువగా ఉంది. ప్రస్తుతం మహబూబాబాద్ మండలంలో 41, కేసముద్రం 40, గూడూరు 39, నెల్లికుదురులో 36 గ్రామపంచాయతీలు ఏర్పాటుచేశారు.
ముఖచిత్రం ఇలా....
1952లో మొదట చిల్లంచెర్ల నియోజకవర్గంగా ఆవిర్భవించింది. ఆ సమయంలో డోర్నకల్ నియోజకవర్గం ఏర్పడలేదు. 1957, 1962లో చిల్లంచెర్ల నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహించారు. 1967లో మానుకోట నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఆ నాటి నుంచి మానుకోట నియోజకవర్గంగా కొనసాగుతుంది. 1972 నుంచి 2014 వరకు ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ఆరు సార్లు కాంగ్రెస్ గెలుపొందింది. సీపీఐ, టీడీపీ, టీఆర్‌ఎస్ ఒక్కోసారి గెలుపొందాయి.
2009 నుంచి ఎస్టీ రిజర్వు...
2009లో మానుకోట నియోజకవర్గం ఎస్టీకి రిజర్వు అయింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మాలోత్ కవిత గెలుపొందారు. 2014లో టీఆర్‌ఎస్ నుంచి బానోత్ శంకర్‌నాయక్ విజయం సాధించారు.
దక్కని మంత్రి పదవి....
మానుకోట నియోజకవర్గానికి ఒక్కసారి కూడా రాష్ట్ర మంత్రి పదవి దక్కలేదు. ఈ సారైనా మానుకోట నుంచి గెలిచిన అభ్యర్థికి మంత్రి పదవి దక్కుతుందా అనే చర్చ కొనసాగుతుంది.
నియోజకవర్గ ప్రత్యేకతలు...
గిరిజనులు అధికంగా ఉండడం. కేసముద్రం మార్కెట్ పసుపు కొనుగోలులో ఉమ్మడి జిల్లాలోనే మొదటి స్థానం. తెలంగాణలో రెండో స్థానంపసుపు, పత్తి పంటలు అనుకూలమైన నేలలు. మల్యాలలో కేవీకే పరిశోధన కేంద్రం.
ఎక్కువ సంఖ్యలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులు ఉండి రాష్ట్రంలోనే క్రీడల పరంగా జిల్లాకు ప్రత్యేక స్థానం. క్రీడల్లో రాణించి ఉద్యోగాలు పొందిన వారు ఎక్కువ మంది ఉన్నారు. బాస్కెట్ బాల్, కబడ్డీ, ఖోఖో, హ్యాండ్ బాల్‌లో రాణించే క్రీడాకారులు ఎక్కువ మంది ఉన్నారు.
మండలాల వారీగా ఓటర్లు..
మండలం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం
గూడూరు 20,017 19,729 2 39,748
కేసముద్రం 24,609 24,442 5 49,056
మహబూబాబాద్ 40,127 40,906 17 81,050
నెల్లికుదురు 20,396 20,051 1 40,448
దంతాలపల్లి 705 681 0 13,086
మొత్తం 1,05,254 1,05,809 25 2,11,688
మొదటిసారి ఓటు ఆలోచించి వేస్తా...
ఈ సారే ఓటు హక్కు వచ్చింది. అన్ని విధాలుగా ఆలోచించి ఓటేస్తా. సమర్ధులకే యువత ఓటేయాలి. యువత ఓట్లే గెలుపోటములు నిర్ణయిస్తాయి. మొదటి ఓటు కాబట్టి జీవితాంతం గుర్తుంటుంది. నాతో పాటు మా ఇంట్లో ఓట్లు కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మంచి అభ్యర్థికి వేస్తాం. పార్టీ కంటే అభ్యర్థికే ప్రాధాన్యత ఇవ్వాలి. – మహ్మద్ ఖాజా, మహబూబాబాద్
9 సార్లు ఓటు వేశా..
గత ఎన్నికల్లో ఇన్ని నిబంధనలు లేవు. ఇప్పటి వరకు తొమ్మిది సార్లు ఓటేశా. అప్పుడు డబ్బులు, మద్యం ఇతరత్రా ప్రభావం లేదు. పార్టీకి కట్టుబడి చాలా మంది ఓటేసేవారు. ఐదేండ్లకు ఒకసారి వచ్చే ఓటు విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. గత ఎన్నికలకు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలకు విధానాల్లో చాలా మార్పు వచ్చింది. కొత్త మిషన్‌ల మీద ప్రధానంగా సీనియర్ సిటిజన్‌లకు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలి. – శ్రీరామోజు సుందరమూర్తి,
మానుకోట సీనియర్ సిటిజన్
జనాభా వివరాలు (2011)
పురుషులు 1,46,079
మహిళలు 1,46,031
మొత్తం 2,92,110
అక్షరాస్యత
పురుషులు 87,054
మహిళలు 63,678
మొత్తం 1,50,732
ఓటర్ల వివరాలు (2018)
పురుషులు 1,05,254
మహిళలు 1,05,809
ఇతరులు 25
మొత్తం 2,11,688
భజే.. డోలు భాజే..అపూర్వ స్వాగతం కోలాటంఆడేస్తా..ఇస్త్రీ చేస్తా..సమస్యలు పరిష్కరిస్తా..ఇస్త్రీ చేస్తా..
పాలకుర్తి: మండల కేంద్రంలో నిర్వహించిన గొల్లకుర్మల ర్యాలీలో డోలు వాయిస్తున్న ఆపధ్ధర్మ డిప్యూటీ సీఎం కడియం, నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి దయాకర్‌రావు తదితరులు
సంగెం: ప్రచారానికి వచ్చిన పరకాల టీఆర్‌ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డికి బతుకమ్మలతో స్వాగతం పలుకుతున్న శ్రేణులు
వర్ధన్నపేట: కోనాపురంలో మహిళలతో కలిసి కోలాటమాడుతున్న టీఆర్‌ఎస్ అభ్యర్థి అరూరి రమేష్
జనగామ : ఇస్త్రీ చేస్తున్న టీఆర్‌ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment