చిల్పూరు /స్టేషన్‌ఘనన్‌పూర్: స్టేషన్‌ఘన్‌పూర్ చరిత్ర ఘనంగానే ఉంది. తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటుంది. విలక్షణ తీర్పు, రాజకీయాలకు పురిటిగడ్డగా పేరొందింది. ఇక్కడ నమోదైన రికార్డును ఇంతవరకూ ఎవరూ అధిగమించలేదు. అందుకు నిదర్శనం దేశంలోనే సంచలం సృష్టించే విధంగా 1952లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్నికల్లో అప్పటి స్టేషన్‌ఘన్‌పూర్ తాలుడాలోని చిన్నపెండ్యాల గ్రమానికి చెందిన పెండ్యాల రాఘవరావు హన్మకొండ, వర్ధన్నపేట శాసనసభలకు,వరంగల్ పార్లమెంట్ మూడు స్థానాల నుంచి పోటీ చేసి మూడు స్థానాల్లో గెలుపొందారు. ఇప్పటికీ ఆయన రికార్డును ఎవరు బ్రేక్ చేయలేదు.
అంచనాలకు అందకుండా...
ఇక్కడి ఒటర్లు నేతల అంచనాలకు అందకుండా విలక్షణ తీర్పునిస్తుంటారు. జిల్లాలు, మండలాలల పునర్విభజనలో భాగంగా రెండేళ్ల క్రితం డివిజన్ కేంద్రంగా ఏర్పడిన ఘన్‌పూర్ విద్య, వ్యాపార రంగాల్లో అభివృద్ది దిశగా నడుస్తుంది. ఘన్‌పూర్, శివునిపల్లి జంట పట్టణాలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళశాలలతో ఎడ్యుకేషన్ హబ్ అభివృద్ది చెందుంతోంది. ఇక్కడ నుంచి గెలిచిన వారికి ఉన్నత పదవులను అందించి నియోజకవర్గంగా ఘన్‌పూర్‌కు ప్రతేక స్థానం ఉంది. ఇక్కడ నుంచి గెలిచిన హయగ్రీవాచారి, గోక రామస్వామి, విజయరామరావు, కడయం శ్రీహరి, డాక్టర్ రాజయ్య మంత్రులుగా పనిచేశారు. డాక్టర్ రాజయ్య, కడియం శీహరిలు డిప్వూటీ సీఎంలుగా పని చేశారు. కడియం ఆపద్దర్మ డిప్యూటీ సీఎంగా కొనసాగిస్తున్నారు.
1957లో నిమోజకవర్గ ఏర్పాటు...
1957లో ఘన్‌పూర్, ధర్మసాగర్, జఫర్‌గడ్ మండలాలతో జనరల్‌గా నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 1952లో కాంగ్రెస్ నుంచి బేతి కేశవరెడ్డి, 1962లో సీపీఐ అభ్వర్థి మెహన్‌రావు, 1967 లో స్వతంత్ర్య అభ్యర్థి తోకల లక్ష్మారెడ్డి, 1972లో కాంగ్రెస్ నుంచి హయగ్రీవాచారి గెలుపొందారు.1978లో ఘన్‌పూర్ ఎస్సీ రిజర్వ్‌డ్ నియాజకవర్గంగా ఏర్పడ్డాక కాంగ్రెస్ నుంచి గోక రామస్వామి, 1985లో నూతనంగా ఏర్పడిన టీడీపీ నుంచి బొజ్జపల్లి రాజయ్య గెలుపొందారు. 1989లో కాంగ్రెస్ నుంచి ఆరోగ్యం,1994,1999లో కడియం శ్రీహరి వరుసగా రెండుసార్లు టీడీపీ నుంచి గలిచి ఉమ్మడి రాష్ట్ర్రంలో వివిధ శాఖల్లో మంత్రిగా పనిచేశారు. 2004లో కాంగ్రెస్,టీఆర్‌ఎస్ పోత్తులో భాగంగా టీఆర్‌ఎస్‌కు చెందిన గుండె విజయరామారావు గెలుపొంది మంత్రిగా పనిచేశారు.
ఉప ఎన్నికలు...
2008లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ వైరుధ్వాల మధ్య ఉపఎన్నికలు నిర్వహించారు. ఆ సమయంలో టీడీపీ నుంచి కడియం శీహరి గెలుపొందారు. అదేవిధంగా 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో కడియం శీహరిపై డాక్టర్ రాజయ్య టీఆర్‌ఎస్ నుంచి భారీ మెజారిటితో గెలుపొంది మంత్రిగా పనిచేశారు.
నియోజకవర్గ పునర్విభజన..
2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా స్టేషన్‌ఘన్‌పూర్, రఘునాథాపల్లి. లింగాలఘనపురం, జఫర్‌గడ్, ధర్మసాగర్ ఐదు మండలాలతో ఏర్పడింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ టి.అంజయ్య కడియం శ్రీహరిపై గెలుపొందారు. 2014లో సాధారణ ఎన్నికల్లో భాగంగా డాక్టర్ అంజయ్య గెలుపొందడంతో ఉప ముఖ్యమంత్రి , వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కొన్ని నెలల పాటు పనిచేశారు.
మండలాలు ఇలా..
ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉన్నాయి. స్టేషన్‌ఘన్‌పూర్, చిల్పూరు,జఫర్‌గడ్, రఘునాథపల్లి, లింగాల ఘనపురం,ధర్మసాగర్,వేలేరు మండలాలున్నాయి. కాగా ఓటర్ల పరంగా చూస్తే ఐనవోలు, కాజిపేట మండలాల్లోని కొన్ని గ్రామాలు నియోజకవర్గంలో చేరాయి.
పట్టించుకుంటానని అన్నోళ్లకే ఓటేశా..
గాయల్లా తమని పట్టించుకుంటానని మాటిచ్చినోనికే ఓటేశాము. డబ్బులు,తాగుడు తెలియదు. ఓటేయడానికి సద్దులు కట్టుకుని పోయెటొళ్లం గిప్పడు ఓటు కోసం అందరు డబ్బులు ఇస్తాండ్రు. యెవరికి ఏయాల్నో తెలుస్తలేదు.
-పులి రాజయ్య, స్టేషన్‌ఘన్‌పూర్
సద్వినియోగం చేసుకుంటా...
ఈసారే ఓటు హక్కు వచ్చింది. ప్రజలను పట్టించుకునే వారు.. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేసే వారికే ఓటు వేస్తా.పూర్తి స్థాయిలో ఆలోచించి నా ప్రథమ ఓటును మంచి వారికి వేసి సద్వినియోగం చేసుకుంటా.
-చిలగాని అశిక, విద్యార్థిని,శివునిపల్లి
Comments
Please login to add a commentAdd a comment