మావోయిస్టుల పిలుపు మేరకు ఖమ్మం జిల్లా చర్ల మండలంలో శుక్రవారం బంద్ ప్రశాంతంగా సాగుతోంది.
చర్ల : మావోయిస్టుల పిలుపు మేరకు ఖమ్మం జిల్లా చర్ల మండలంలో శుక్రవారం బంద్ ప్రశాంతంగా సాగుతోంది. కాగా, మండలంలోని లెనిన్ కాలనీలో గురువారం రాత్రి మావోయిస్టులు బంద్ కు పిలుపునిస్తున్నట్లు పోస్టర్లు అంటించారు. వెంకటాపురం ఏరియా కమిటీ పేరిట ఉన్న ఈ పోస్టర్లలో...బంద్‌ను విజయవంతం చేయాలని ఉంది. పోలీసులు అక్కడికి చేరుకుని, వాటిని తొలగించారు. అయితే గత కొన్ని రోజుల కిందట నుంచి ఫిబ్రవరి 20న బంద్ కు పిలుపునిస్తున్నట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే.