కలెక్టరేట్, న్యూస్‌లైన్: మెదక్ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా టీఎన్‌జీఓస్ కేంద్ర కమిటీ బాధ్యులు దేవీప్రసాద్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నామని టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు రాజేందర్, గౌరవ అధ్యక్షుడు శ్యామ్‌రావు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని డీపీఆర్‌ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లాకు చెందిన దేవీప్రసాద్ తెలంగాణ మలిదశ ఉద్యమంలో శక్తి వంచన లేకుండా కృషి చేశారన్నారు. టీఎన్‌జీఓస్‌ను ఏకతాటిపై నడిపి 42 రోజుల సకలజనుల సమ్మె ఉద్యోగుల సహాయ నిరాకరణ వంటి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారన్నారు. దేవీప్రసాద్ అభ్యర్థిత్వాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు.
2న తెలంగాణ సంబరాలు
రాష్ర్ట ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 2న జిల్లా వ్యాప్తంగా సంబరాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. సంగారెడ్డిలోని కలెక్టరేట్ నుంచి అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ నిర్వహించి నివాళులర్పిస్తామన్నారు. ప్రతి కార్యాలయంలోను సంబరాలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో టీఎన్‌జీఓస్ నేతలు యాదమ్మ, శ్యామ్, నర్సింలు,సతీశ్, సిద్ధిరామ్, సుశీల్‌కుమార్, రవి, చారి, యాదవరెడ్డి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
మెదక్ ఎంపీగా దేవీప్రసాద్ పోటీచేయాలి
Published Mon, May 26 2014 11:25 PM | Last Updated on Sat, Mar 9 2019 3:34 PM
Advertisement
Advertisement