
తీన్‌మార్గ్
ఖైరతాబాద్ వైపు నుంచి కూకట్‌పల్లి వైపు ఓ రోడ్డు మార్గం... బంజారాహిల్స్ వైపు నుంచి సికింద్రాబాద్ వైపు మరో రోడ్డు మార్గం... ఇదే మార్గంలో ఫ్లైఓవర్లు... ఇప్పుడు ఆ ఫ్లైఓవర్లపై నుంచి మెట్రో రైల్ లైన్... అప్పుడప్పుడు సినిమాల్లో ఫారిన్ సీన్లలో కనిపించే దృశ్యాలు.. రానున్న రోజుల్లో పంజగుట్టలో కనిపించనున్నాయి. ఎర్రమంజిల్ వద్ద రోడ్డునుంచి తాకేంత ఎత్తులోనే మెట్రో రైల్వే స్టేషన్.. పంజాగుట్ట వరకు వచ్చే సరికి 70 అడుగుల ఎత్తులో పిల్లర్ల నిర్మాణం..
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చిత్రాలు.. ఇక్కడ ఇప్పటికే ఫ్లైఓవర్ ఉండటంతో దానిపైనుంచి మెట్రో లైన్ నిర్మాణం జరుగుతోంది. ఖైరతాబాద్ నుంచి ఎత్తును పెంచుకుంటూ వస్తున్నారు. ఎర్రమంజిల్ మెట్రో రైల్వే స్టేషన్ భూమిని తాకేంత ఎత్తులో నిర్మాణం జరుగుతోంది. నెల రోజుల నుంచి పంజగుట్ట చౌరస్తాలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట పిల్లర్ల నిర్మాణం కొనసాగిస్తున్నారు. భారీ రద్దీ, ట్రాఫిక్ సమయాల్లోనూ పనులు కొనసాగిస్తున్నారు. ప్రయాణికులు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. పంజగుట్టలో మెట్రోరైలు పనులు పూర్తయితే ఈ చౌరస్తా రూపురేఖలే మారనున్నాయి.