కూకట్ పల్లి-మియాపూర్ లో మెట్రో రైలు పరుగులు | metro rail trial run kukatpally, miyapur route | Sakshi
Sakshi News home page

కూకట్ పల్లి-మియాపూర్ లో మెట్రో రైలు పరుగులు

Published Thu, May 7 2015 4:50 PM | Last Updated on Tue, Oct 30 2018 4:05 PM

కూకట్ పల్లి-మియాపూర్ లో మెట్రో రైలు పరుగులు - Sakshi

కూకట్ పల్లి-మియాపూర్ లో మెట్రో రైలు పరుగులు

హైదరాబాద్: కూకట్ పల్లి-మియాపూర్ మార్గంలో మైట్రో రైలు పట్టాలెక్కింది. గురువారం ఈ మార్గంలో ట్రయన్ రన్ నిర్వహించారు. 4 కిలోమీటర్ల వరకు విజయవంతంగా ఈ ట్రయల్ రన్ సాగింది. మరోవైపు ఉప్పల్- మెట్టుగూడ మార్గంలో ట్రయల్ రన్ కొనసాగుతోంది. దీని ద్వారా వివిధ స్థాయిల్లో పనులను అధికారులు సమీక్షిస్తున్నారు. సిగ్నలింగ్, ట్రాక్, డ్రైవర్ రహిత టెక్నాలజీ వినియోగం, లైటింగ్, రైళ్ల సామర్థ్యం వంటి సాంకేతిక అంశాల్లో ఉప్పల్ మెట్రోడిపోలోని 8 రైళ్లు విజయవంతంగా ప్రయోగ పరీక్షలు పూర్తి చేసుకున్నాయి.

కాగా ఇప్పటికే నాగోల్-మెట్టుగూడ రూట్లో మెట్రో స్టేషన్ల నిర్మాణం తుది దశకు చేరుకుంది. మార్చి 21 (ఉగాదిన)న మెట్రో రైలు సర్వీసును నాగోలు- మెట్టగూడల మధ్య ప్రారంభం కావాల్సి ఉన్నా సాంకేతిక కారణాలతో వాయిదా పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement