కరీంనగర్ జిల్లా సారంగాపూర్ మండలం అర్పపల్లిలో దొంగలు ఆదివారం అర్ధరాత్రి మూడు ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డారు.
కరీంనగర్ జిల్లా సారంగాపూర్ మండలం అర్పపల్లిలో దొంగలు ఆదివారం అర్ధరాత్రి మూడు ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డారు. గ్రామంలో ఈశ్వర్, ప్రకాశ్ కుటుంబ సభ్యులు ఇళ్ల ముందు ఆరు బయట నిద్రించగా... కిషన్ కుటుంబ సభ్యులతో కలసి వేరే ఊరు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దొంగలు మూడు ఇళ్లల్లోకి చొరబడి బీరువా తలుపులు బద్దలు కొట్టి.. సుమారు పది తులాల బంగారు ఆభరణాలు, నగదు చోరీ చేశారు. సోమవారం చోరీ విషయాన్ని గమనించి.. విషయం గ్రామ సర్పంచ్ కి తెలిపారు. గ్రామ సర్పంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.