భీమవరంలో చోరీ | robbery inbvrm | Sakshi
Sakshi News home page

భీమవరంలో చోరీ

Published Mon, Dec 26 2016 12:19 AM | Last Updated on Mon, Sep 4 2017 11:35 PM

robbery inbvrm

భీమవరం టౌ న్‌  : పట్టణంలోని బొక్కావారిపాలెంలో ఓ ఇంట్లో చోరీ జరిగినట్టు వ న్‌ టౌ న్‌  ఎస్‌ఐ సీహెచ్‌వీ రమేష్‌ ఆదివారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. బొక్కావారిపాలెంలో బొక్కా నాగవెంకట సత్యనారాయణ కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు చొరబడ్డారు. బీరువాలోని 9 కాసుల బంగారం, రూ.20 వేల నగదు, సెల్‌ఫోను చోరీ చేశారు. ఉదయం చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన నాగవెంకట సత్యనారాయణ ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు 
ఎస్‌ఐ చెప్పారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement