తెలంగాణలోని చారిత్రక దేవాలయాలను అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.
రంగారెడ్డి జిల్లా: తెలంగాణలోని చారిత్రక దేవాలయాలను అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఆదివారం మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో జరిగిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి కల్యాణ మహోత్సవానికి మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ... మేడారం జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేశామని చెప్పారు. భవిష్యత్తులోనూ ఘనంగా నిర్వహించేందుకు చర్యలు చేపడతామన్నారు. రాఘవాపూర్ గ్రామంలో సబ్‌స్టేషన్ నిర్మాణ పనులను మంత్రి మహేందర్‌రెడ్డి ప్రారంభించారు.