
చంద్రబాబుది దొంగచూపు
ఆంధ్రా సీఎం చంద్రబాబు వల్లే రాష్ట్రంలో విద్యుత్ సమస్య నెలకొన్నదని, ఆయనది ముందుచాపు కాదు.. దొంగ చూపని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి విమర్శించారు.
‘‘కేసీఆర్ పాలన సజావుగా సాగనివ్వకుండా చంద్రబాబు కుట్ర పన్నుతున్నాడు. ఈ ఆంధ్రాబాబు వల్లే తెలంగాణలో కరెంటు కష్టాలు.. ఆయనది ముందుచూపు కాదు.. దొంగచూపు. చీమూ, నెత్తురు ఉంటే టీడీపీ నేతలు ఆ పార్టీ విడిచి బయటికి రావాలి.’’
మంత్రి జగదీష్‌రెడ్డి
బీబీనగర్ :ఆంధ్రా సీఎం చంద్రబాబు వల్లే రాష్ట్రంలో విద్యుత్ సమస్య నెలకొన్నదని, ఆయనది ముందుచాపు కాదు.. దొంగ చూపని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి విమర్శించారు. బీబీనగర్‌లో శుక్రవారం జరి గిన బహిరంగ సభలో మంత్రి సమక్షం లో స్థానిక ఎంపీపీ గోళి ప్రణీతాపింగళ్‌రెడ్డి దంపతులు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత కాంగ్రెస్, టీడీపీ పాలకుల పనితీరు వల్లే తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని, వాటిని చక్కదిద్దడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నాడన్నారు.
తెలంగాణకు ద్రోహం చేసిన ఆంధ్రాపాలకుల జెండాలను పట్టుకొని తిరగుతున్న కాంగ్రెస్, టీడీపీ దద్దమ్మ లు అత్మ విమర్శ చేసుకోవాలన్నారు. బస్సుయాత్రల పేరుతో తిరుగుతున్న టీడీపీ నాయకులను చీపురుకటక్టలతో తరిమి కొట్టాలని, అసమర్థ పాలన సాగించిన సన్నాసులు జానారెడ్డి, పొన్నాలను నిలదీయాలన్నారు. ఆంధ్రా జెండాలను పాతరేసి రాష్ట్రలోని ప్రతి గ్రామా న్ని గులాబీమయంగా చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
కేసీఆర్ పాలన సజావుగా సాగనివ్వకుం డా చంద్రబాబు కుట్రలు పన్నుతున్నాడని, ఇప్పటికైనా తెలంగాణలోని టీడీపీ నేతలు పార్టీని వీడాలన్నారు. ప్రపంచంలోని ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిదేందుకు కేసీఆర్ పని చేస్తున్నాడన్నారు. లక్ష మంది దళితులకు 5సంవత్సరాల్లో భూపంపిణీ చేస్తామన్నారు. 20వేల కోట్ల రుణాలను రద్దు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పింఛన్లను దోసుకున్న దొంగలు కాంగ్రెస్ నాయకులని ఘాటుగా విమర్శించారు. సాగునీటి విషయంలో రాష్ట్రానికి తీరని అన్యా యం చేసిన పొన్నాల గోచీ పీకే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. బీబీనగర్ మండల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి మా ట్లాడుతూ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు., ఆంధ్రా పాలకుల చేతిలో మోసపోయిన తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చా రు. కార్యక్రమంలో మునుగోడు ఎమ్మె ల్యే ప్రభాకర్‌రెడ్డి, నాయకులు ఎలిమినేటి కృష్ణారెడ్డి, అమరేందర్, సుధాకర్, వెంకటకిషన్, నరేందర్, ప్రభాకర్, రవికుమార్‌రెడ్డి పాల్గొన్నారు.