
నా సభలోనే కరెంట్ కట్ చేస్తారా?
హరితహారం సభలో తాను ప్రసంగిస్తున్న సమయంలో కరెంట్ కట్ కావడంతో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు.
విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డి అసహనం
చౌటుప్పల్: హరితహారం సభలో తాను ప్రసంగిస్తున్న సమయంలో కరెంట్ కట్ కావడంతో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం రెడ్డిబావి గ్రామం గ్రీన్‌గ్రోవ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఆయన ప్రసంగం మొదలు పెట్టిన కొద్దిసేపటికే కరెంట్ కట్ అయింది. మైకు రాకపోవడంతో సౌండ్స్ ప్రాబ్లమ్ అనుకున్నారు.
కానీ సౌండ్స్ బాగానే ఉన్నాయి, కరెంట్ కట్ అయిందని మంత్రికి చెప్పడంతో, ఏమయ్యా.. ఏఈ లేడా? నేను పాల్గొన్న సభలోనే కరెంట్ కట్ చేస్తారా.. అని అసహనం వ్యక్తంచేశారు. వెంటనే స్కూలు వాళ్లు జనరేటర్ స్టార్ట్ చేయడంతో ప్రసంగాన్ని మొదలుపెట్టారు.