రాష్ట్ర విద్యాశాఖమంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి బుధవారం జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ టి.చిరంజీవులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు సూర్యాపేటలో
రాంనగర్ : రాష్ట్ర విద్యాశాఖమంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి బుధవారం జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ టి.చిరంజీవులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు సూర్యాపేటలో దక్షిణమధ్య రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌ను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అనంతరం 12 గంటలకు మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొని 4.30 గంటలకు దేవరకొండలో జరిగే వివిధఅభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని వివరించారు. రాత్రి 7 గంటలకు సూ ర్యాపేటకు చేరుకుని అక్కడే బస చేస్తారని తెలిపారు.