యాదగిరిగుట్ట: వచ్చే ఆగస్టు 15 కల్లా భువనగిరి, ఆలేరు నియోజక వర్గాల్లోని 400 గ్రామాలకు మంచినీరు అందించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వ విప్ గొంగడి సునీత తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం ఆమె యాదగిరిగుట్టలో కొనసాగుతున్న మిషన్ భగీరథ పనులను పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఇంటింటికీ మంచినీరు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో తాగునీటి కొరత లేకుండా చేస్తామని విప్ చెప్పారు.