నాగిరెడ్డిపేట :తెలంగాణలో అకాల వర్షాలతో జరిగిన పంట నష్టంపై జిల్లాల వారీగా సర్వేకు ఆదేశించామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పలు గ్రామాలలో సోమవారం ఆయన 'మిషన్ కాకతీయ' పనులను ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... భారీవర్షంతో రాష్ట్రంలో వరి, మొక్కజొన్న, జొన్న, కుసుమలు, సజ్జలు, పసుపు పంటలకు నష్టం జరిగిందన్నారు.
సర్వే చేసిన అనంతరం అధికారులు ఇచ్చే నివేదికలను ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. నష్ట పరిహారంపై ముఖ్యమంత్రితో చర్చిస్తామని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు చర్యలు చేపడతామని వెల్లడించారు.