ప్రచార పదనిసలు | MLA Candidates different elections campaign In Nalgonda district | Sakshi
Sakshi News home page

ప్రచార పదనిసలు

Published Mon, Nov 5 2018 12:51 PM | Last Updated on Tue, Aug 27 2019 4:45 PM

MLA Candidates different elections campaign In Nalgonda district - Sakshi

డోలు కొట్టు.. ఓటు పట్టు
మిర్యాలగూడ : మిర్యాలగూడ బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆదివారం పట్టణంలోని ప్రకాశ్‌నగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా డోలు కొట్టి ఓట్లు అడిగారు. 

బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో..
మునుగోడు : టీఆర్‌ఎస్‌ మునుగోడు అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆదివారం మునుగోడు మండలం చల్మెడలో ప్రచారం నిర్వహించారు.   ప్రచారంలో భాగంగా మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి ఓట్లను అభ్యర్థించారు. 

హాట్‌హాట్‌గా ప్రచారం
చౌటుప్పల్‌(మునుగోడు) : బీజేపీ మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ గంగిడి మనోహర్‌రెడ్డి ఆదివారం చౌటుప్పల్‌లోని పలు కాలనీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ వద్ద నూడుల్స్‌ తయారీ చేసి  ఓట్లు అభ్యర్థించారు. 

డప్పు కొడతా.. ఓట్లు పడతా..
ఆత్మకూరు(ఎం)(ఆలేరు) : టీఆర్‌ఎస్‌ ఆలేరు ఎమ్మెల్యే అభ్యర్థి గొంగిడి సునీత ఆదివారం ఆత్మకూరు(ఎం) మండలం రాయిపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డప్పు కొడుతూ ఓట్లను అభ్యర్థించారు. 

వెయ్‌.. దరువెయ్‌..
టీఆర్‌ఎస్‌ సూర్యాపేట అభ్యర్థి, మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి ఆదివారం సూర్యాపేట మండలంలో విస్తృతంగా ప్రచారం చేశారు. గాంధీనగర్‌లో ఇంటింటికి తిరుగుతూ  మళ్లీ కారు గుర్తుకే ఓటెయ్యాలని కోరారు. ఈ సం దర్భంగా డోలు వా యిస్తూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement