► కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి ధ్వజం
మోదీ.. నల్లధనం ఏదీ?
Published Wed, Mar 1 2017 12:20 PM | Last Updated on Wed, Apr 3 2019 4:10 PM
నారాయణపేట : బీజేపీ అధికారంలోకి వస్తే విదేశాల్లో ఉన్న రూ.80 లక్షల కోట్ల నల్లధానాన్ని భారతదేశానికి తీసుకువచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తానని ప్రకటించిన ప్రధాని నరేంద్రమోదీ హామీ ఏమైందని కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి ప్రశ్నించారు. డీసీసీ ఆధ్వర్యంలో నారాయణపేట కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి సరాఫ్‌కృష్ణ అధ్యక్షతన మంగళవారం స్థానిక మెట్రో ఫంక్షన్‌హాలులో జన ఆవేదన సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. నల్లధనం బయటికి తీసేందుకు ద మ్ములేక నోట్ల రద్దు నాటకంతో కేంద్రసర్కార్ ప్ర జలను ఇబ్బందులకు గురిచేసిందన్నారు.
సీఏం కేసీఆర్ అబద్దాల కోరు అని ఎద్దేవాచేశారు. పూటకోమాటతో ప్రజల ను తప్పుదోవపట్టిస్తున్నరన్నారు. సోనియా ఇచ్చిన రాష్ట్రాన్ని కేసీఆర్ తెచ్చానంటున్నారని దు య్యబట్టారు. అధికారంలోకి వ చ్చాక నారాయణపేటను జిల్లా చేస్తామన్నారు. ప్ర జాసంక్షేమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మాజీ మంత్రి, పీసీసీ ఉపాధ్యక్షురాలు, గద్వాల ఎమ్మెల్యే డీకే ఆరుణ ఆరోపించారు. హామీ ల ఊసేలేదన్నారు. నారాయణపేట డివిజ న్‌కు సా గునీరు అందించేందుకు జీఓ 69ను ఉమ్మడి ప్రభుత్వంలో జారీ చేస్తే దాన్ని పక్కన బెట్టి పాలమూరు–రంగారెడ్డి పథకం ద్వారా నీరు అందిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
అనంతరం పార్టీ నేతలను ఇన్‌చార్జి సరాఫ్ కృష్ణ శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో అలంపూర్ ఎమ్మె ల్యే సంపత్‌కుమార్, డీసీసీబీ చైర్మన్ వీరారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ నిజాంపాషా, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, శశికళ, రాంచందర్‌రావు, శ్రీనివాస్‌గుప్తా, అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, రెడ్డి గారి రవీందర్‌రెడ్డి, రాజేందర్‌గౌడ్, బసిరెడ్డి పాల్గొన్నారు.
Advertisement
Advertisement