మార్కెట్ వ్యాపారులు, అధికారులకు డీడీఎం సూచన
వరంగల్ సిటీ : దేశంలో పంట ఉత్పత్తులకు మంచి ధర దక్కేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన నేషనల్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ వ్యవస్థ(నామ్) అమలు బాధ్యత అందరిదని వరంగల్ రీజినల్ మార్కెటింగ్ డిప్యూటీ డెరైక్టర్ ఉప్పుల శ్రీనివాస్ అన్నారు. వరంగల్ వ్యవసాయ మార్కెట్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం మార్కెట్ కార్యదర్శి అజ్మీరా రాజు అధ్యక్షతన అడ్తి, వ్యాపారులతో సమావేశం జరిగింది. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై నామ్ అమలు తీరు, విధివిధానాలు, వ్యాపారులు, అధికారులు అనుసరించాల్సిన పద్ధతులను వివరించారు. మొదట చాంబర్ ముఖ్యప్రతినిధులు, ప్రముఖ వ్యాపారులతో సమావేశం నామ్ అమలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర వివరించారు. క్రయ విక్రయూలు సింగిల్ లెసైన్స్‌డ్ విధానంతో పారదర్శకంగా ఆన్‌లైన్‌లో జరుగుతాయని, ఇది కూడా ఎన్‌సీడీఎక్స్ (ఈ మార్కెటింగ్) లాంటిదేనని తెలిపారు. దీంతో వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. దేశం మొత్తం ఒకే ధర అమలు కావడం వల్ల రైతులకు మంచి ధర దక్కే అవకాశం ఉంటుందని, మోసాలు ఉండవని చెప్పారు. దేశంలో 21 మార్కెట్లలో నామ్ అమలవుతుండగా, తెలంగాణ రాష్ట్రంలో ఐదు మార్కెట్లలో మాత్రమే అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు చెప్పారు. ఈమేరకు వరంగల్ మార్కెట్‌లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఛాంబర్ అధ్యక్షుడు కటకం పెంటయ్యతో పాటు ప్రముఖ వ్యాపారులు పాల్గొన్నారు.
కాగా సమావేశం తర్వాత మార్కెట్‌లోని అన్ని హోదాల అధికారులతో సమావేశం నిర్వహించి నామ్ అమలుకు సీరియస్ ఆదేశాలు జారీ చేశారు. సీజన్‌కు ముందు మార్కెట్‌లో ఈ మార్కెటింగ్ ప్రవేశపెట్టినప్పుడు వ్యాపారులు రైతులను రెచ్చగొట్టి అమలు కాకుండా చేసిన విషయూన్ని సిబ్బంది గుర్తుచేశారు. ఎట్టిపరిస్థితుల్లో నామ్‌ను అమలు చేయూలని ఆయన సూచించారు. మార్కెట్ అధికారులు వేముల వెంకటేశ్వర్లు, పి.అశోక్, శ్రీధర్, ఓని కుమారస్వామి, ప్రభాకర్, రమేష్, ఎస్.రమేష్, లక్ష్మీనారాయణ, చక్రబహుదూర్, రాజేందర్, అంజిత్‌రావు, బీయాబాని, వేణుగోపాల్, మందవేణు పాల్గొన్నారు.
‘నామ్’ అమలు.. అందరి బాధ్యత
Published Wed, Mar 23 2016 1:36 AM | Last Updated on Sun, Sep 3 2017 8:20 PM
Advertisement
Advertisement