డ్రగ్స్‌ కేసులో ఎవర్నీ వదిలేది లేదు: నాయిని | Naini comments on drugs issue | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ కేసులో ఎవర్నీ వదిలేది లేదు: నాయిని

Published Mon, Jul 31 2017 2:50 AM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM

డ్రగ్స్‌ కేసులో ఎవర్నీ వదిలేది లేదు: నాయిని - Sakshi

డ్రగ్స్‌ కేసులో ఎవర్నీ వదిలేది లేదు: నాయిని

తిరుపతి రూరల్‌: డ్రగ్స్‌ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతోందని, నిందితుల్లో ఏ ఒక్కర్నీ వదిలేది లేదని హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం కుటుంబ సభ్యులతో కలసి తిరుపతికి వచ్చిన ఆయన.. తుమ్మలగుంటలోని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నివాసంలో అల్పాహారం తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్‌ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుందని చెప్పారు. పెద్ద తలలను వదిలి, చిన్న వారిని వేధిస్తున్నారనే ఆరోపణలను ఆయన ఖండించారు.

భూ కుంభకోణాల నుంచి దృష్టి మళ్లించేందుకే డ్రగ్స్‌ వ్యవహారాన్ని సాగదీస్తున్నారనే విమర్శల్లో నిజం లేదన్నారు. దేశంలో ఏ రాష్ట్రమూ అభివృద్ధి చెందని విధంగా తెలంగాణను సీఎం కేసీఆర్‌ అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. ఆదివారం తిరుమలకు చేరుకున్న నాయిని సోమవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement