మిర్యాలగూడలో గులాబీ జెండా ఎగురేస్తాం | Nallamothu Bhaskar Rao Canvass In Miryalaguda | Sakshi
Sakshi News home page

మిర్యాలగూడలో గులాబీ జెండా ఎగురేస్తాం

Published Mon, Dec 3 2018 10:27 AM | Last Updated on Mon, Dec 3 2018 10:27 AM

Nallamothu Bhaskar Rao Canvass In Miryalaguda - Sakshi

ప్రచారంలో మాట్లాడుతున్న భాస్కర్‌రావు

సాక్షి, మిర్యాలగూడ : మిర్యాలగూడలో గులాబీ జెండా ఎగురవేసి కేసీఆర్‌కు కానుకగా ఇస్తామని మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నల్లమోతు భాస్కర్‌రావు అన్నా రు. ఆదివారం స్థానిక సంతోష్‌నగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీ ఆర్‌ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రజల్లో అపూర్వ స్పందన కనిపిస్తుందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలే మళ్లీ టీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తీసుకవస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు తిరునగరు భార్గవ్, కౌన్సిలర్‌ వంగాల నిరంజన్‌రెడ్డి, ఎఎంసీ వైస చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు సైదులుబాబు, వీరారెడ్డి, షోయాబ్, వహిద్, ఇమ్రాన్, అనిల్, పద్మావతి పాల్గొన్నారు. 
భాస్కర్‌రావు సతీమణి ప్రచారం..
భాస్కర్‌రావు సతీమణి జయ ఆదివారం పట్టణంలోని హనుమాన్‌పేట, ఈదులగూడ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె వెంట ధూళిపాల కళావతి, దేవకమ్మ, శ్రీనివాస్‌రెడ్డి, లింగా రెడ్డి, నాగరాజు, వెంకన్న పాల్గొన్నారు. 
బాపూజీనగర్‌లో తనయుడి ప్రచారం..
భాస్కర్‌రావు తనయుడు నల్లమోతు సిద్ధార్థ ఆదివారం పట్టణంలోని బాపూజీనగర్, వడ్డెరిగూడెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. ఆయన వెంట కౌన్సిలర్‌ అంజన్‌రాజు, నాయకులు కుర్ర విష్ణు, ముత్యం, శ్రీనివాస్, సైదులు, పెద వెంకటమ్మ, లింగమ్మ, శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు. 
టీఆర్‌ఎస్‌లో చేరిక..
మండలంలోని ఊట్లపల్లి గ్రామానికి చెందిన అంబేద్కర్‌ యూత్, యాదవ యూత్‌ ఆధ్వర్యంలో పలువురు యువకులు ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో నల్లమోతు భాస్కర్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరిన వారిలో మనోజ్, బొంగరాల సందీప్, నవీన్, సురేష్, మధు, రమేష్‌ ఉన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, మండల అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, సైదులుయాదవ్, మనోహర్‌రెడ్డి తదితరులు  పాల్గొన్నారు. 

మరిన్ని వార్తాలు...

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

ప్రచారంలో పాల్గొన్న భాస్కర్‌రావు సతీమణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement