
'లెజెండ్'లో బాలకృష్ణ(ఫైల్)
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 'లయన్' సినిమా షూటింగ్ లో కారు చోరీకి గురైంది. షూటింగ్ కోసం ఆయన వాడుతున్న కారును ఎత్తుకెళ్లారంటూ హయత్ నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
ఎస్.ఎల్.వి. సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న 'లయన్' సినిమాకు సత్యదేవ్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలకృష్ణ సరసన త్రిష, రాధికా ఆప్టే నటిస్తున్నారు.