
కీసరలో బాలయ్య సందడి
కీసర: కీసర మండలంలోని కరీంగూడా- కీసర ఓఆర్‌ఆర్ జంక్షన్ సమీపంలో గల ఓఆర్‌ఆర్‌పై ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ శనివారం కూడా కొనసాగింది. సత్యదేవ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు. ఓఆర్‌ఆర్‌పై బాలకృష్ణ , రౌడీల మధ్య ఫైటింగ్ సన్నివేశాలు.. బాలకృష్ణ బైక్‌పై రౌడీలను తరమడం, ఆకాశంపై నుండి హెలీకాప్టర్ వెంబడించడం వంటి సన్నివేశాలను చిత్రీకరించారు. ఫైటర్స్ రామ్‌లక్ష్మణ్‌ల ఆధ్వర్యంలో పైటింగ్ సన్నివేశాలను షూట్ చేశారు. బాలకృష్ణను చూసేందుకు సమీప గ్రామాల ప్రజలు పెద్దఎత్తున ఇక్కడకు తరలివచ్చారు. బాలయ్య బాబు షూటింగ్ విరామంలో పలుమార్లు అభిమానులను పలుకరించారు. ఈ సినిమాను రుద్రపాటి రమణారావు నిర్మిస్తుండగా త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది.