బోగీల్లో శబ్దాలు..ఆగిన నాందేడ్ రైలు | nanded train stopped due to sounds from few compartments | Sakshi
Sakshi News home page

బోగీల్లో శబ్దాలు..ఆగిన నాందేడ్ రైలు

Published Wed, Feb 18 2015 1:15 PM | Last Updated on Sat, Sep 2 2017 9:32 PM

nanded train stopped due to sounds from few compartments

డిచ్‌పల్లి: కాచిగూడ నుంచి నాందేడ్ వెళ్లే రైలు బోగీల్లో శబ్దాలు వస్తుండటంతో కొద్దిసేపు నిలిచిపోయింది.నాందేడ్ రైలు రెండు బోగీల నుంచి పెద్దగా శబ్దాలు వస్తుండటంతో డ్రైవర్ బుధవారం మధ్యాహ్నం నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ఇందల్వాయి స్టేషన్‌లో కొద్దిసేపు సర్వీసును ఆపేశారు.

శబ్ధాలు రావడంతో భయబ్రాంతులకు లోనైన ప్రయాణికులు కొందరు రైలు దిగారు. అర్దగంట అనంతరం తిరిగి రైలు సేవల్ని పునరుద్ధరించి,రైలును నిజామాబాద్ తీసుకెళ్లారు. మరమ్మతుల అనంతరం 12.30 గంటల ప్రాంతంలో నాందేడ్ వైపు బయలుదేరిందని రైల్వే అధికారులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement