ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోనే దేశాభివృద్ధి సాధ్యపడుతుందని బీజేపీ జిల్లా ..
సారంగాపూర్ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోనే దేశాభివృద్ధి సాధ్యపడుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అయ్యన్నగారి భూమయ్య అన్నారు. మండలంలోని జామ్, సారంగాపూర్, బీరవెల్లి తదితర గ్రామాల్లో మంగళవారం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా గ్రామాలకు చెందిన సుమారు 150మంది పార్టీలో చేరగా భూమయ్య కండువాలు వేసి వారిని పార్టీలోకి స్వాగతించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చాక అనేక సంస్కరణలు జరిగాయన్నారు. పలు ప్రధాన కార్యక్రమాలను చేపట్టి దేశాభివృద్ధికి సహకరిస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో స్వచ్ఛమైన భారతదేశాన్ని చూస్తామని ధీమా వ్యక్తం చేశారు. నాయకులు రచ్చ మల్లేశ్, ఆడెపు మహేందర్, సుమన్ తదితరులున్నారు.