
నల్లగొండలో జాతీయ ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రం: కేటీఆర్
నల్లగొండలో జాతీయ ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు.
మోత్కూరు: నల్లగొండలో జాతీయ ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. గురువారం మోత్కూరు మండలం కొండగడపలో రూ. 9లక్షల వ్యయంతో నిర్మించిన ఆరోగ్య ఉప కేంద్రం, రూ.కోటి వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను మరోమంత్రి జగదీష్‌రెడ్డితో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఫ్లోరోసిస్‌ను నిర్మూలించడానికి గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ సీఈ స్థాయి అధికారితో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ ఐదేళ్లలో నల్లగొండను ఫ్లోరిన్హ్రిత జిల్లాగా మారుస్తామని హామీ ఇచ్చారు. మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన ప్రణాళికలో ప్రజల భాగస్వామ్యం మరింతగా పెరగాలన్నారు.