న్యూఢిల్లీ : తెలంగాణ సర్కార్‌కు జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో ఎదురు దెబ్బ తగిలింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు నిలిపివేయాలంటూ ఎన్‌జీటీ గురువారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పూర్తిస్థాయిలో పర్యావరణ, అటవీ శాఖ అనుమతులు వచ్చేవరకూ ప్రాజెక్ట్ నిర్మాణపు పనులు నిలుపుదల చేయాలని ఆదేశించింది. కాగా అనుమతులు లేకుండా అటవీ భూముల్లో నిర్మాణాలు చేపట్టారని హయత్ ఉద్దీన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాగునీటి ప్రాజెక్ట్ అని తెలంగాణ సర్కార్ ఎన్‌జీటీ ఎదుట వాదనలు వినిపించింది. నీటి పారుదల ప్రాజెక్ట్‌గా మార్చేనాటికల్లా అన్ని అనుమతులు సాధిస్తామని తెలిపింది. అయితే పర్యావరణ, అటవీ అనుమతులు వచ్చేంతవరకూ కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు నిలిపివేయాలని ఎన్‌టీజీ ఆదేశాలు ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment