పాఠ్య పుస్తకాల్లో కొత్త పాఠాలు | new texts in text books | Sakshi
Sakshi News home page

పాఠ్య పుస్తకాల్లో కొత్త పాఠాలు

Published Tue, Jan 17 2017 2:12 AM | Last Updated on Tue, Sep 5 2017 1:21 AM

new texts in text books

► 1 నుంచి 10వ తరగతిలో జెండర్‌ సెన్సిటివిటీ
►  టెన్త్  సోషల్‌లో ఎన్నికల సంస్కరణలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఒకటి నుంచి పదో తరగతి వరకున్న వివిధ పాఠ్య పుస్త కాల్లో కొత్త పాఠాలు రాబోతున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మారిన పాఠ్యాం శాలు అమల్లోకి వస్తాయి. ఈ మేరకు విద్యా శాఖ చర్యలు చేపట్టింది. 2014లో రాష్ట్రం ఏర్పడిన తరువాత పాఠ్య పుస్తకాలను తెలం గాణకు అనుగుణంగా మార్పులు చేసిన వి ద్యాశాఖ తాజాగా వాటిల్లో పొరపాట్లను సవ రించి కొన్ని కొత్త పాఠాలను చేర్చుతోంది. ఈ ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది.

ఇవీ మార్పులు...
♦ ముఖ్యంగా 9వ తరగతిలోని సాంఘిక శాస్త్రంలో తెలంగాణ ఉద్యమం  పాఠంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ గురించి పలు అంశాలను చేర్చారు.
♦ కొత్తగా ఏర్పడిన 31 జిల్లాల భౌగోళిక అంశాలు, వివరాలను 6 నుంచి 9వ తరగతి వరకు సాంఘిక శాస్త్రాల్లోని జాగ్రఫీలో చేర్చారు.
♦ పదో తరగతి విద్యార్థులకు ఎన్నికల అంశాలపై అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఎన్నికల సంస్కరణలపై ప్రత్యేకంగా పాఠం పెట్టారు. ♦ 7, 8, 9 సోషల్‌ స్టడీస్‌లో జెండర్‌ సెన్సి టివిటీ, సెక్యువల్‌ అబ్యూజ్‌పై పాఠాలను, చేర్చారు. 3, 4, 5 తరగతుల ఇన్విరాన్ మెంటల్‌ స్టడీస్‌తోపాటు ఒకటి నుంచి పదో తరగతి వరకు ఇంగ్లిషు రీడర్‌లోనూ జెండర్‌ సెన్సిటివిటీపై పాఠాలు రానున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement