సాక్షి, నాగారం: స్వచ్ఛంద సంస్థ ‘బీ ద చేంజ్’ సౌజన్యంతో ఆషీ ఫౌండేషన్ సభ్యులు శనివారం నాగారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలు పంపిణీ చేశారు. వీటితో పాటు వాటర్ బాటిళ్లు, పెన్నులు కూడా ఇచ్చారు. దాదాపు వంద మంది విద్యార్థులకు వీటిని అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు మల్లారెడ్డితో పాటు స్వచ్ఛంద సంస్థల వలంటీర్లు పవిత్ర, కావ్య, సౌమ్య, జయ, భార్గవ్, రామకృష్ణ పాల్గొన్నారు.
పేద విద్యార్థుల చదువు ఆగిపోకూడదన్న ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాలు చేపట్టినట్టు వలంటీర్లు తెలిపారు. జూపార్క్, చార్మినార్, గోల్కొండ కోట ప్రదేశాలకు పేద విద్యార్థులను తీసుకెళ్లి వారి ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తున్నామని చెప్పారు. వలంటీర్లు వచ్చిన వచ్చిన వారంతా కాలేజీ విద్యార్థులే కావడం విశేషం. చిన్న వయసులోనే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న వీరిని పాఠశాల సిబ్బంది అభినందించారు. తమకు ఉచితంగా బ్యాగులు, పుస్తకాలు పంపిణీ చేసినందుకు విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment