పూలాంగ్ చౌరస్తాలో తనిఖీలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు
నిజామాబాద్ సిటీ(నిజామాబాద్ అర్బన్): కరోనా విస్తరిస్తోందని, దీనిని అరికట్టాలంటే 21రోజుల పాటు ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వ అధికారులు వేడుకుంటున్నా ప్రజలు వారి మాటాను పెడచెవిన పెడుతున్నారు. జిల్లా కేంద్రంలో కరోనా కట్టడికి పోలీసులు తగు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నగరంలో పూలాంగ్ చౌరస్తా, వర్ని చౌరస్తా, నెహ్రూ పార్కు, ధర్నాచౌక్, కంఠేశ్వర్, దుబ్బా చౌరస్తాలతో పాటు పలు చౌరస్తాలలో బారికేడ్లు ఏర్పా టు చేసి అటుగా వచ్చేవారిని ఎక్కడికని ప్రశ్నిస్తున్నారు. దీనికి వీరు ఏదో కారణం చెప్పి తప్పించుకుంటున్నారు. కొందరూ అత్యవసర పనుల కోసం బయటకు వస్తే, మరికొందరూ పనిపాట లేకుండా బయట యథేచ్ఛగా తిరుగుతున్నారు.
కరోనా వైరస్ విభృంభిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా 21రోజుల పాటు విధించిన లాక్‌డౌన్‌ను పట్టించుకోక పోవటంతో సమ స్య ఎంతవరకు వెళ్తుందోనంటూ ఓ పోలీస్ అధికారి వ్యాఖ్యానించారు. అత్యవసర పనుల కోసం మాత్రమే బయటకు రావాలని సూచిస్తే ప్రభుత్వ నిబంధనలు భేఖాతరు చేయటంపై పోలీసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో ప్రజలు ఇళ్లలో నుండి బయటకు వచ్చి గుంపులు గుంపులుగా ఒకచోట చేరి పి చ్చాపాటిగా మాట్లాడుకోవటం, దగ్గరగా కూ ర్చోని సెల్‌ఫోన్లు చూడటంవంటివి చేస్తున్నారు. పోలీసులు అటుగా పెట్రోలింగ్‌కు వెళ్లినప్పుడే వారు అక్కడినుండి జారుకుంటూ పోలీసులు వెళ్లిపోయాక తిరిగి రోడ్లపైకి వస్తున్నారు. పోలీసులు వీరికి మైక్‌ల ద్వారా హెచ్చరికలు జారీ చే సిన ఫలితం లేకుండా పోతోంది.
Comments
Please login to add a commentAdd a comment