సాక్షి, వరంగల్ : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల దాఖలుకు సోమవారం చివరి రోజు కావడంతో ఐదు జిల్లాల్లోనూ భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి.నామినేషన్లు కూడా అయిపోవడంతో నేతలందరూ ప్రచారాలకూ సిద్ధమవుతూ తలాములకలు అవుతున్నారు. పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్‌రావు (టీఆర్‌ఎస్), ములుగులో సీతక్క (కాంగ్రెస్), జనగామలో పొన్నాల లక్ష్మయ్య (కాంగ్రెస్), మానుకోటలో బలరాంనాయక్ (కాంగ్రెస్) తదితరులు సోమవారం నామినేషన్లు వేశారు. మంగళవారం నామినేషన్ల స్క్రూటినీ చేయనున్నారు. నామినేషన్ ఉపసంహరణకు 22న మధ్యాహ్నం మూడు గంటల వరకు గడువు ఉంది.
ఒక్కరోజే 16 మంది నామినేషన్లు..
వరంగల్ రూరల్ | 72 |
జయశంకర్ | 49 |
జనగామ | 66 |
మహబూబాబాద్ | 32 |
వరంగల్ అర్బన్ | 101 |
జనగామ
జనగామ: జనగామ జిల్లాల్లో మూడు నియోజకవర్గాల్లో మొత్తంగా 66 మంది అభ్యర్థులు 102 సెట్లు నామినేషన్లు వేశారు. ఇందులో జనగామలో 19 మంది అభ్యర్థులు 35 సెట్లు, స్టేషన్‌ఘన్‌పూర్‌లో 19 మంది అభ్యర్థులు 36 సెట్లు, పాలకుర్తిలో 24 మంది అభ్యర్థులు 42 నామినేషన్లను సెట్లు దాఖలు చేశారు. జనగామ నియోజకవర్గంలో మొత్తంగా 19 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. సోమవారం ఒక్కరోజే 16 మంది వేశారు.
వీరిలో పొన్నాల లక్ష్మయ్య(కాంగ్రెస్), వెంటలక్ష్మి నర్సింహారెడ్డి (కేవీఎల్‌ఎన్ రెడ్డి)(బీజేపీ), ఇర్రి అహల్య(సీపీఎం), కొత్తపల్లి సతీష్ కుమార్(బీఎస్పీ), ఇండిపెండెంట్లుగా తాటికొండ రాజయ్య, భీమా లక్ష్మణ్, జేరిపోతుల ఉపేందర్, టి.అశోక్ ఆనంద్‌కుమార్, మెరుగు శ్రీనివాస్, మదవశెట్టి శ్రావణ్ కుమార్, శాకపల్లి శ్రీనివాస్‌రెడ్డి, జేరిపోతుల కుమార్, నిమ్మ జైచంద్రారెడ్డి, అక్కలదేవి మోహన్‌రాజు, పిట్టల సత్యం, కొండేటి మహేందర్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు.
పాలకుర్తిలో 24 మంది అభ్యర్థులు
పాలకుర్తి టౌన్: పాలకుర్తి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు 24 మంది అభ్యర్దులు 42 సెట్లు దాఖలు చేశారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాలతి తెలిపారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు(టీఆర్‌ఎస్), జంగా రాఘవరెడ్డి (కాంగ్రెస్), ఎర్రబెల్లి ఉషాదేవి, జంగా సుజాత, పెదగాని సోమయ్య (బీజేపీ), జిలుకర శ్రీనివాస్ (బీఎస్‌పీ), మామిండ్ల రమేష్‌రాజా (సిపిఐఎంఎల్ లిబరేషన్), మక్కల నాగలక్ష్మి (బీఎల్‌పీ), బిల్లా సుధీర్ రెడ్డి, లింగాల మధురశ్రీ గౌడ్, కొర్ర నర్సింహ, విశ్వనాద్ గోగిహంస, గ్యార వెంకటేష్, రాపర్తి రాజు, తండ ఉపేందర్, ఇనుగల యుగేందర్‌రెడ్డి, లకావత్ విజయ్‌కుమార్, గోపాల్‌దాస్ హరినాద్, సింగారపు దయాకర్, కూనబోయిన కుమారస్వామి, కన్నె లక్ష్మణ్‌రావు, రాము బీరెల్లి, మాచర్ల శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు.
ఘన్‌పూర్‌లో ఆఖరి రోజున ముమ్మరం
స్టేషన్‌ఘన్‌పూర్: సోమవారం మొత్తంగా 23 సెట్ల నామినేషన్లు దాఖలు కాగా నూతనంగా తొమ్మిది మంది నామినేషన్లు వేసినట్లు ఆర్‌ఓ రమేష్ తెలిపారు. బొట్ల శేఖర్ (సీపీఎం), కాంగ్రెస్ రెబల్‌గా మంద రమేష్ నామినేషన్ వేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా గ్యార నర్సింగరావు, మునిపెల్లి ఆనందం, రిటైర్డ్ జేసీ సురభి సత్తయ్య, జెరిపోతుల ఉపేందర్, తుమ్మల కుమారస్వామి, తాటికాయల క్రాంతికుమార్, గాదెపాక అనిల్‌కుమార్ నామినేషన్లు దాఖలు చేశారు. సింగపురం ఇందిర(కాంగ్రెస్) తరఫున సోమవారం రెండు సెట్లు నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ రెబల్‌గా మాదాసు వెంకటేశం, రాజారపు ప్రతాప్ (బీఎస్‌పీ), చింతా స్వామి (టీజేఎస్), తాటికొండ రాజయ్య(టీఆర్‌ఎస్), శాగ రాజు (టీడీపీ), ఇండిపెండెంట్ నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం ఒక్కరోజులోనే 23 నామినేషన్ సెట్లు దాఖలయ్యాయి.
సాక్షి, భూపాలపల్లి: నామినేషన్ల చివరి రోజు సోమవారం జిల్లాలోని భూపాలపల్లి(23), ములుగు(10) నియోజకవర్గాల్లో 33 మంది నామినేషన్లు వేశారు. నామినేషన్ల స్వీకరణ నుంచి ఇప్పటి వరకు మొత్తం రెండు నియోజకవర్గాల్లో కలిపి 49 మంది నామినేషన్లు వేశారు.
భూపాలపల్లిలో..
భూపాలపల్లిలో చివరి రోజు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి, బీఎల్‌పీ అభ్యర్థి పటేల్ వనజతో పాటు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలుచేశారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 31 నామినేషన్లు వచ్చాయి. చివరిరోజు 23 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి నుంచి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా సిరికొండ మధుసూదనాచారి, బీజేపీ అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డి, ఆలిండియా ఫార్వర్డ్‌బ్లాక్ అభ్యర్థిగా గండ్ర సత్యనారాయణరావు, వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
ములుగులో..
ములుగు నియోజకవర్గంలో చివరి రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి సీతక్క, బీజేపీ నుంచి దేవీలాల్‌తోపాటు బీజేపీ రెబల్ అభ్యర్థిగా రాజునాయక్, టీఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థిగా గోవింద్‌నాయక్, బీఎల్పీ అభ్యర్థిగా తవిటి నారాయణ, వివిధ పార్టీలకు చెందిన వారితోపాటు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్‌లు దాఖలు చేశారు. ఇప్పటి వరకు ములుగు నియోజకవర్గలో మొత్తం 18 నామినేషన్‌లు రాగా చివరి రోజు 10 వచ్చాయి.
వరంగల్ అర్బన్
హన్మకొండ అర్బన్ వరంగల్ అర్బన్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో సోమవారం 101 నామినేషన్లు దాఖలయ్యాయి. పశ్చిమలో 17మంది అభ్యర్ధులు, వరంగల్ తూర్పులో 28మంది అభ్యర్ధులు తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. వివిధ రాజకీయ పార్టీలతోపాటు స్వతంత్రులు, రెబల్స్ పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేశారు. మొత్తంగా వరంగల్ పశ్చిమ–31, వరంగల్ తూర్పు–37, వర్ధన్నపేట–33 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రముఖుల్లో నన్నపునేని నరేందర్ (టీఆర్‌ఎస్), రేవూరి ప్రకాశ్‌రెడ్డి (టీడీపీ), వద్దిరాజు రవిచంద్ర (కాంగ్రెస్), ఎర్రబెల్లి ప్రదీప్‌రావు (ఆల్‌ఇండియా ఫార్వర్డ్ బ్లాక్), అచ్చవిద్యాసాగర్ (కాంగ్రెస్ రెబల్), గాదె ఇన్నయ్య (టీజేఎస్) తదితరులు ఉన్నారు.
గీసుకొండ నుంచే అత్యధికంగా ..
గీసుకొండ(పరకాల): గీసుకొండ మండలానికి చెందిన వారే పరకాల అసెంబ్లీ ఎన్నికల బరిలో అత్యధికంగా నామినేషన్లు వేశారు. సోమవారం నామినేషన్ల పర్వం ముగిసే సరికి మొత్తం 23 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా వారిలో 11 మంది మండలానికి చెందినవారే కావడం విశేషం. కాంగ్రెస్ అభ్యర్థులుగా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖతో పాటు ఆమె భర్త కొండా మురళీధర్‌రావు కాంగ్రెస్ నుంచి రెండు సెట్ల చొప్పున చివరి రోజు నామినేషన్లు దాఖలు చేశారు. రెండో డివిజన్ మొగిలిచర్లకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు ఆడెపు రమేష్ ఇండిపెండెంట్‌గా, మండలంలోని ఎలుకుర్తి హవేలికి చెందిన దరమ్ యువరాజ్ సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. వంచనగిరి గ్రామానికి చెందిన కొమ్ముల ధర్మయ్య సమాజ్‌వాదీ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా, రిపబ్లికన్ పార్టీ నుంచి రెండో డివిజన్ గొర్రెకుంటకు చెందిన ఎలమండ్రి రవి, ఇండిపెండెంట్‌గా గనిపాక కొర్నేలు, గంగదేవిపల్లి గ్రామానికి చెందిన గోనె కుమారస్వామి ఎంసీపీఐ నుంచి, గీసుకొండ నుంచి చాపర్తి కుమారస్వామి ఇండిపెండెంట్‌గా, ధర్మారం నుంచి పున్నం భాగ్యశ్రీ, మూడో డివిజన్ కీర్తినగర్‌కు చెందిన గుండా రాము శివసేన పార్టీ నుంచి నామినేషన్లు దాఖలు చేశారు.
సాక్షి, మహబూబాబాద్: మానుకోట నియోజకవర్గంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, బీజేపీ అభ్యర్థి జాటోతు హుస్సేన్‌నాయక్, కాంగ్రెస్ అభ్యర్థి బలరాంనాయక్, కాంగ్రెస్ రెబల్‌గా గుగులోతు దస్రూనాయక్, బీఎస్పీ తరఫున భూక్యా బాలునాయక్, అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ తరుపున బానోతు రెడ్యానాయక్, తెలంగాణ ఇంటి పార్టీ నుంచి ఎల్.శంకర్ చౌహన్, స్వతంత్ర అభ్యర్థులుగా నారాయణ్‌సింగ్, బానోతు రాందాస్, హలావత్ లింగ్యా, డప్పు ప్రసాద్, సోలమ్ సహదేవ్, పడిగే నాగేశ్వర్‌రావు, నునావత్ రాములు, భట్టు బిన్మమ్మ, డమ్మీ అభ్యర్థులుగా కాంగ్రెస్ నుంచి పోరిక సాయి శంకర్, బీఎల్‌ఎపీ నుంచి బానోతు లక్ష్మీ నామినేషన్లు వేశారు. నియోజకవర్గంలో మొత్తం 18 నామినేషన్లు పడ్డాయి.
డోర్నకల్ బరిలో 14 మంది
నామినేషన్ల మొదటిరోజే డీఎస్.రెడ్యానాయక్(టీఆర్‌ఎస్), జాటోతు రామచంద్రూనాయక్(కాంగ్రెస్) నామినేషన్లు వేశారు. సోమవారం చివరి రోజు కావడంతో రెడ్యానాయక్, రామచంద్రూనాయక్ మరో సెట్ వేశారు. వీరితో పాటు బీజేపీ అభ్యర్థి లక్ష్మణ్‌నాయక్, బీజేపీ రెబల్‌గా బాలూనాయక్, భూక్య గోపికృష్ణ నామినేషన్లు వేశారు. టీఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థిగా డీఎస్ వెంకన్న, కాంగ్రెస్ రెబల్‌గా మాలోతు నెహ్రునాయక్ నామినేషన్ వేశారు. బీఎస్పీ తరుపున మాలోతు శ్రీనివాస్‌నాయక్, యూసీసీఆర్‌ఐ(ఎంఎల్) తరఫున అజ్మీరా రత్నం, బీఎల్‌పీ తరుపున అంగోత్ వెంకన్న, స్వతంత్ర అభ్యర్థులుగా బానోత్ రాందాస్, జాటోత్ ప్రమీలరాణి నామినేషన్లు వేశారు.
వరంగల్ రూరల్ జిల్లా
సాక్షి, వరంగల్ రూరల్: వరంగల్ రూరల్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో సోమవారం 48 నామినేషన్లు వచ్చాయి. పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో మొత్తంగా 72 నామినేషన్లు వేశారు. ఆదివారం వరకు 24 మంది నామినేషన్లు దాఖలు చేయగా, సోమవారం ఒక్కరోజే 48 నామినేషన్లు వేశారు.
నర్సంపేటలో 16 మంది.. 30 సెట్లు
నర్సంపేట నియోజకవర్గంలో 16 మంది 30 సెట్ల నామినేషన్లు వేశారు. నర్సంపేట నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి(టీఆర్‌ఎస్), దొంతి మాధవరెడ్డి (కాంగ్రెస్), ఎడ్ల అశోక్ రెడ్డి (బీజేపీ), ఉమాశంకర్(బీజేపీ), మద్దికాయల అశోక్ (బీఎల్‌పీ), దయాకర్(బీఎస్పీ), కురుమల్ల రామ్మూర్తి (పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), దేవేందర్ (సమాజ్‌వాదీ పార్టీ), ప్రేమ్‌లాల్ (జై మహా భారత్ పార్టీ), పూర్ణచందర్ (శివసేన), చిన్ని కృష్ణ, నాగేశ్వర్‌రావు, కిరణ్ కుమార్, విష్ణుకుమార్, సుధీర్, రాజేష్ (ఇండిపెండెంట్లు) ఉన్నారు.
పరకాలలో 23 మంది.. 38 సెట్లు
పరకాల నియోజకవర్గంలో 23 మంది 38 సెట్లలో నామినేషన్లు వేశారు. చల్లా ధర్మారెడ్డి (టీఆర్‌ఎస్), కొండా సురేఖ (కాంగ్రెస్), కొండా మురళీధర్ రావు (కాంగ్రెస్), పున్నం భాగ్యశ్రీ (కాంగ్రెస్), డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి (బీజేపీ), పెసరు సుదేశన (బీజేపీ), దారం యువరాజు (సమాజ్‌వాదీ పార్టీ), ధర్మయ్య (సమాజ్‌వాదీ ఫార్వర్డ్ బ్లాక్), ఈసంపెల్లి వేణు (ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్), ఇమ్మద్రి రవి (రిపబ్లికన్ పార్టీ), గోనె కుమారస్వామి(ఎంసీపీఐ), గుండా రాము (శివసేన), సింగారపు రాజు (బహుజన్ సమాజ్ పార్టీ), ఆడెపు రమేశ్, ఆర్షం శ్రీనివాస్, అబ్బిరెడ్డి బుచ్చిరెడ్డి, చల్లా జ్యోతి, గనిపాక కొర్నేల్, సాంబయ్య, కుమారస్వామి, పట్టెం సౌజన్య, గాలి రవీందర్, ఉప్పుల శ్రీనివాస్ (ఇండిపెండెంట్లు) ఉన్నారు.
వర్ధన్నపేట 33 మంది.. 54 సెట్లు
వర్ధన్నపేట నియోజకవర్గంలో 33 మంది 54 సెట్లు నామినేషన్లు వేశారు. వారిలో అరూరి రమేష్ (టీఆర్‌ఎస్), కొత్త సారంగరావు (బీజేపీ), కొత్త ఇందిర (బీజేపీ), పగిడిపాటి దేవయ్య (టీజేఎస్, బీఎస్పీ), కొండేటి శ్రీధర్(కాంగ్రెస్), నమిండ్ల శ్రీనివాస్ (కాంగ్రెస్), నరసింహస్వామి(బీఎల్‌పీ), గంధం శివ(బీఎస్పీ), నద్దునూరి సంపత్(ఎస్పీ), తుమ్మల యాకయ్య (టీడీపీ), సుదమల్ల వెంకటస్వామి, జెట్టి స్వామి, జన్ను నితీష్ కుమార్, బండి క్రాంతికుమార్, లెనిన్, నర్సయ్య, రాజభద్రయ్య, రిపిక, కళావతి, జనార్దన్, కుమార్, కుమారస్వామి, రాజ్‌కుమార్, దయాకర్, ఎ కమలాకర్, నగేష్, కట్టయ్య, రమేశ్, శోభన్‌బాబు, టి.కమలాకర్, ఎలిషా, సతీష్‌బాబు, మధుకర్(ఇండిపెండెంట్లు) ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment