నిజామాబాద్ అర్బన్: ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాలలకు ఉన్నతాధికారుల నిర్ణయం మింగుడు పడడం లేదు. సరి అయిన సౌకర్యాలు లేవంటూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 174 కళాశాలలకు కత్తెర వేసింది. ఇందులో భాగంగా జిల్లాలో ఏడు కళాశాలల సీట్లను రద్దు చేసింది. దీంతో ఆయా కళాశాలల యాజమాన్యాలు అయోమయంలో పడిపోయాయి. ప్రస్తుతం జరుగుతున్న ఎంసెట్ కౌన్సెలింగ్‌లో కేవలం మూడు ఇంజినీరింగ్ కళాశాలలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో విద్యార్థులు సీట్లు లభిస్తాయో లేదోనని ఆందోళన చెందుతున్నారు.
ఉన్నవి ఇవే
ప్రస్తుతం ఇంజనీరింగ్ ప్రవేశాలకు జిల్లాలో అందుబాటులో ఉన్నవి మూడు కళాశాలలే. మాక్లూర్ మండలం మానిక్‌భండార్‌లోని కాకతీయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మహిళా ఇంజనీరింగ్ కళాశాల, ఆర్మూర్ మండలం చేపూర్‌లోని క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల, మాక్లూర్ మండలం దాస్‌నగర్‌లో విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలకు మాత్రమే జేఎన్‌టీయూ అనుమతినిచ్చింది. అసౌకర్యాల నేపథ్యంలో జిల్లాలోని ఏడు కళాశాలలకు అనుమతి నిరాకరించింది.
ఇందులో సుధీర్‌రెడ్డి, జ్ఞానసర స్వ తి, ఎస్‌ఆర్‌ఐటీ, విజయ్ మహిళ, వీట్, తిరుమల, ఆర్.కె. కళాశాలలు ఉన్నాయి దీంతో భారీగా సీట్లు తగ్గిపోయాయి. జిల్లాలో 10 ఇంజనీరింగ్ కళాశాలలు ఉండగా 3,0 60 సీట్లు అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం 1,060 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
‘రెండో’ విడత వరకు అయినా అనుమతి వస్తుందా!
జిల్లావ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్నారు. వీరికి సీట్ల సంఖ్య ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా విద్యార్థినుల కోసం కిట్స్ మహిళా కళాశాల మాత్రమే అందుబాటులో ఉంది. బోధన్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాల స్వయం ప్రతిపత్తి హోదాలో కొనసాగుతోంది. మిగిలిన కళాశాలలు జేఎన్‌టీయూ పరిధిలో ఉన్నాయి. అనుమతి కోల్పోయిన కళాశాలలు తగు సౌకర్యాలను కల్పించి, రెండవ దఫా కౌన్సెలింగ్ వరకు అనుమతి పొందే అవకాశం ఉంది.
దీనికొరకు ఆయా ఇంజనీరింగ్ కళాశాలలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం మూడు కళాశాలలే అందుబాటులో ఉన్నాయి. క్షత్రియ ఇంజినీరింగ్ కళాశాలలో ఏజీఆర్, సీఐవీ, సీఎస్‌ఈ, ఈసీఈ, ఈఈఈ, ఎంఈసీ బ్రాంచీలు అందుబాటులో ఉన్నాయి. మహిళా కిట్స్ కళాశాలలో సీఐవీ, సీఎస్‌ఈ, ఈసీఈ, ఈఈఈ బ్రాంచీలు ఉన్నాయి. వీఆర్‌సీలో సీఐవీ, సీఎస్‌ఈ, ఈసీఈ, ఈఈఈ, ఎంఈసీ బ్రాంచీలు ఉన్నాయి.
మిగిలినవి మూడే
Published Fri, Aug 22 2014 2:54 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement