
సాక్షి, హైదరాబాద్ : అధికారంలోకి రాగానే రెండున్నర కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న బీజేపీ మాట తప్పిందని స్టూడెంట్స్ యూనియన్ ఎన్‌ఎస్‌యూఐ విమర్శలు గుప్పించింది. అయిదేళ్ల పాలనాకాలంలో నిరుద్యోగ నిర్మూలనకు ప్రధాని మోదీ చేపట్టిన చర్యలు శూన్యమని ఆరోపించింది. ఉద్యోగాల కల్పన విషయంలో బీజేపీ విఫలమైందని ఆరోపిస్తూ..ధర్నా చౌక్‌లో బుధవారం షూ పాలిష్ చేసి ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు నిరసన చేపట్టారు. అక్కడే ఉన్న పోలీసులకు సైతం షూ పాలిష్ చేసేందుకు యత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. రాహుల్ ప్రధాని అయితేనే దేశంలో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఎన్‌ఎస్‌యూఐ నాయకులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment