హైదరాబాద్
పింఛన్ కోసం కాళ్లరిగేలా తిరిగిన సత్తయ్య అనే వృద్దుడు కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. నాలుగైదు సార్లు తిప్పిన అధికారులు ఇంకో జాబితా వస్తుంది రమ్మని పిలిచారు. ఆఫీసు 10 గంటలకు తెరుస్తారంటే.. ఎక్కడ పింఛను రాదోనని ఉదయం 7 గంటలకే వచ్చి క్యూలో నిల్చున్నాడు. చివరకు అక్కడా ఆలస్యం చేయడంతో.. అక్కడే కుప్పకూలాడు.
ఎల్బీ నగర్ కొత్తపేట పింఛన్ కేంద్రంలో ముత్తం సత్తయ్య (70) అనే వృద్ధుడు రెండు రోజుల కింద పింఛన్ కోసం వచ్చి అధికారులను సంప్రదించగా, మరుసటి జాబితాలో పేరు వస్తుందని చెప్పారు. మళ్లీ దరఖాస్తు చేసుకోవాలన్నారు. దీంతో సత్తయ్య నాగోలు న్యూమారుతీనగర్ లోని మహిళా భవన్లో ఉదయం 7 గంటలకే వచ్చి పింఛన్ కోసం క్యూలో నిలుచున్నాడు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు క్యూలోనే ఉండాల్సి రావడంతో అక్కడే కుప్పకూలాడు. దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే సత్తయ్య మరణించారని డాక్టర్లు ధ్రువీకరించారు.
పింఛన్ కోసం వచ్చి.. వృద్ధుడి మృతి
Published Sat, Jan 17 2015 3:23 PM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM
Advertisement
Advertisement