old age pension
-
అవ్వా తాతలకు ‘ఆత్మియుడి’ అండ
సాక్షి, అమరావతి: జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని, పిల్లల కోసం ఎంతో కష్టపడి వయస్సు మీద పడిన వృద్ధులకు కావాల్సింది ఓ ఆత్మీయ పలకరింపు. అవ్వా బాగున్నావా.. తాతా బాగున్నావా.. అంటూ మలి సంధ్యలో ఉన్న వారి అవసరాలను తీరిస్తే వారికి అదే ఆనందం. సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలోని వయో వృద్ధులకు అండగా నిలుస్తున్నారు. ప్రభుత్వమే పెద్ద భరోసా అన్నట్లుగా వారికి అవసరమైన అన్ని వనరులు సమకూరుస్తున్నారు. అవ్వా.. తాతా.. అంటూ ఆత్మీయతను అందిస్తున్నారు. వృద్ధాప్య పింఛన్ల నుంచి వైద్యం, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. సంక్షేమంతో పాటు భద్రత, హక్కుల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టారు. గతంలోలా వృద్ధులు పింఛను కోసం మండల, జిల్లా కేంద్రాల్లోని అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఎవరెవరినో బతిమాలుకోవాల్సిన పని లేకుండా వారు ఉన్న చోటుకే వచ్చి పింఛను డబ్బు ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు సీఎం వైఎస్ జగన్. గతంలో వృద్ధులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగలేక, సొమ్మసిల్లి పడిపోయిన సందర్భాలు అనేకం. సీఎం జగన్ ఆ కష్టాల నుంచి అవ్వా తాతలను గట్టెక్కించారు. ఇప్పుడు వలంటీర్లు స్వ యంగా వారు ఉన్న చోటుకు వచ్చి పింఛను డబ్బు అందిస్తున్నారు. వైద్యం కోసం ఆస్పత్రుల వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వైద్యులే గ్రామాలకు వచ్చి, పరీక్షలు చేసి, మందులు కూడా ఇస్తున్నారు. సామాజిక భద్రతలో భాగంగా నెలకు రూ.2,750 చొప్పున వృద్ధాప్య పింఛన్లు అందిస్తోంది. గతంలో వృద్ధాప్య పింఛన్ 65 ఏళ్ల వయోపరిమితి ఉంటే దాన్ని 60 ఏళ్లకే కుదించి ఎక్కువ మందికి వైఎస్సార్ పెన్సన్ కానుక అందిస్తోంది. వృద్ధాప్య, ఇతరత్రా పింఛన్లతో మొత్తం 41,05,501 మంది వృద్ధులు లబ్ధి పొందుతున్నారు. ఏడాదికి సగటున రూ.13,260.41 కోట్లు వృద్ధులకు పింఛన్ రూపంలో ప్రభుత్వం అందిస్తోంది. ప్రభుత్వం ఏపీఎస్‌ఆరీ్టసీ బస్సుల్లో టిక్కెట్ చార్జీ పై 25 శాతం రాయితీ ఇస్తోంది. బస్సుల్లో ముందు డోర్ సమీపంలోని మూడు సీట్లు వృద్ధుల కోసం కేటాయించింది. బస్టాండ్లలో వీల్చైర్లు అందుబాటులో ఉంచింది. వృద్ధుల కోసం మచిలీపట్నం, చిత్తూరులో రాష్ట్ర ప్రభుత్వం 2 వృద్ధాశ్రమాలను నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో స్వచ్ఛంద సంస్థలు (ఎన్జీవోలు) 68 వృద్ధాశ్రమాలు నిర్వహిస్తున్నాయి. శ్రీకాకుళం, విశాఖ, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, కర్నూలు, వైఎస్సార్, తిరుపతి జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 7 ఫిజియోథెరపీ కేంద్రాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 47,490 మంది వృద్ధులు వీటిని ఉపయోగించుకున్నారు. వృద్ధుల సమస్యలు, అవసరాలను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టేందుకు 2021 డిసెంబర్ నుంచి ఎ ల్డర్ లైన్ 14567 (హెల్ప్‌లైన్) నిర్వహిస్తోంది. 26 జిల్లాల నుంచి 39,332 మంది దీని సేవలు ఉపయోగించుకున్నారు. సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 50,08,662 మంది వృద్ధులు ఉన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వృద్ధుల సంక్షేమంపై సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. మలి సంధ్యలో ఎవరూ అవస్థలు పడకూడదనే ఉద్దేశంతో వారి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. వయోవృద్ధుల సమస్యలు, అవసరాలు గుర్తించి సకాలంలో చర్యలు తీసుకునేలా జిల్లా స్థాయిలో ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. – బి.రవిప్రకాశ్‌రెడ్డి, సంచాలకులు, రాష్ట్ర వయోవృద్ధులు, దివ్యాగుల సంక్షేమ శాఖ 5న వయో వృద్ధుల రాష్ట్ర కౌన్సిల్ తొలి సమావేశం ఏపీ వయో వృద్ధుల రాష్ట్ర కౌన్సిల్ తొలి సమావేశం అక్టోబర్ 5న నిర్వహించనున్నారు. మహిళ, శిశు, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్ అధ్యక్షతన వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో తొలి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ట్రిబ్యునల్స్, అప్పిలేట్ ట్రిబ్యునల్స్‌లో తల్లిదండ్రులు, వయోవృద్ధుల ఫిర్యాదుల పరిస్థితి, వారి వైద్య సంరక్షణ, జీవనం, వంటి ప్రధాన అంశాలపై ఈ సమావేశంలో చర్చించి తగిన చర్యలు తీసుకో వాలని సంబంధిత శాఖలకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. -
కేసీఆర్ అవినీతిని ఆపితే 55 లక్షల మందికి పింఛన్ ఇవ్వొచ్చు : రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కడుపుకు అన్నం తినేవారెవరూ రాహుల్‌గాంధీ అర్హత గురించి ప్రశ్నించరని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ పదేళ్లు అధికారంలో ఉన్నా రాహుల్ ఏ పదవినీ తీసుకోలేదని గుర్తు చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబానికి చెందిన రాహుల్‌గాంధీకి తప్ప తెలంగాణలో పర్యటించేందుకు ఇంకెవరికి హక్కు ఉంటుందని ప్రశ్నించారు. గాంధీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదని అన్నారు. అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించినా రాహుల్ ప్రకటించిన విధంగా వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.4 వేల పింఛన్ ఇస్తామని స్పష్టం చేశారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం సభ విజయవంతం కావడంతో.. బీఆర్ఎస్ నేతలు అంటకాగుతున్న ప్రధాని మోదీకి మాత్రమే తెలంగాణలో పర్యటించే హక్కు ఉందా అని రేవంత్ నిలదీశారు. ‘రాహుల్‌గాం«దీని విమర్శిస్తున్న బీఆర్ఎస్ నేతలకు అసలు ఏం అర్హత ఉంది? ట్విట్టర్ పిట్ట, సోడా కలిపేటోడు, భూమికి మూడు అడుగులున్నోడు కూడా రాహుల్ అర్హత గురించి మాట్లాడుతున్నారు..’అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో నిర్వహించిన సభ విజయవంతం కావడంతో అసలు నక్క తప్ప వేట కుక్కలన్నీ బయటకు వచ్చి మొరగడం ప్రారంభించాయని అన్నారు. జనగర్జన సభకు ప్రజలు రాకుండా ప్రభుత్వం అన్ని రకాల కుయుక్తులు పన్నిందని, అక్కడి సైకో మంత్రి అడ్డుకునే ప్రయత్నం చేసినా, కుట్రలను ఛేదించి ఖమ్మంలో సభను విజయవంతం చేశారని అన్నారు. ఇందుకు ఖమ్మం ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. అన్ని హామీలు నిలబెట్టుకున్న చరిత్ర మాది దేశంలో, రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నిలబెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీ దని రేవంత్ అన్నారు. భాక్రానంగల్ నుంచి నాగార్జునసాగర్ సహా, శ్రీరాంసాగర్, జూరా ల లాంటి ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు, లక్షకు పైగా గ్రామాలకు విద్యుత్ సౌకర్యం, అనేక ప్రభుత్వరంగ సంస్థల ఏర్పాటు, ఆర్టీఐ, ఆహా ర భద్రతా చట్టాలు, యూనివర్సిటీల్లో బీసీలకు రిజర్వేషన్లు, ఔటర్ రింగురోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ, ఫార్మా కంపెనీలు, మెట్రో రైలు.. ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో ఉన్నాయని చెప్పారు. తాము ప్రాజె క్టులు తెస్తే, బీఆర్ఎస్ నేతలు ఫామ్‌హౌస్‌లు తెచ్చారని విమర్శించారు. కాళేశ్వరంపై చర్చకు సిద్ధం కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ ఇచ్చిన నివేదికపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని రేవంత్ చెప్పారు. ఈ విషయంలో చర్చ పెడితే తమ పార్టీ తరఫున ఇద్దరు ప్రతినిధులం హాజరవుతామని, మంత్రులు హరీశ్, కేటీఆర్‌లు సి ద్ధమా అని ప్రశ్నించారు. కాళేశ్వరంపై రాహు ల్ చేసిన వ్యాఖ్యలో తప్పేమీ లేదన్నారు. బెంగళూరులో జరిగే విపక్షాల సమావేశానికి బీఆర్ఎస్ను రానివ్వబోమని, ఒకవేళ వస్తే మెడలు పట్టి గెంటేస్తామని అన్నారు. రూ.4 వేల పింఛన్ మా తొలి ప్రాధాన్యత రూ.4 వేలు పింఛన్ ప్రకటనకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని రేవంత్ చెప్పారు. కేసీఆర్ అవినీతిని ఆపితే మొత్తం 55 లక్షల మంది పింఛన్‌దారులకు తాము హామీ ఇచ్చిన విధంగా పింఛన్ ఇవ్వొచ్చని చెప్పారు. తెలంగాణ ఇచి్చనట్టే రూ.4 వేల పింఛన్ ఇచ్చి తీరుతామని అన్నారు. రాష్ట్ర ఆదాయం భారీగా పెరిగిన నేపథ్యంలో ఇప్పుడున్న పింఛన్‌ను రూ.4 వేలకు పెంచడం పెద్ద కష్టమేమీ కాదని వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రూ.4 వేల పింఛన్ ఎందుకు ఇవ్వడం లేదని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించడాన్ని రేవంత్ తప్పుపట్టారు. ఆయా రాష్ట్రాల జనాభా, పార్టీలకుండే ప్రాధాన్యతల మేరకు పథకాలు అమలవుతాయని రేవంత్ చెప్పారు. -
మరణించిన వ్యక్తికి 12 ఏళ్లుగా వృధాప్య పెన్షన్..ఆరా తీస్తే..
పల్నాడు జిల్లాలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. మరణించిన వ్యక్తికి 12 ఏళ్లుగా వృధ్యాప్య ఫించన్ ఇస్తున్నారంటూ విమర్శుల వెల్లువెత్తాయి. చాలా ఏళ్ల క్రితం తండ్రి చనిపోతే..అతడి పెన్షన్‌కి ఆశపడి ప్రభుత్వాని మోసం చేస్తున్న కొడుకు ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన చనిపోయని వ్యక్తి బతికున్నట్లు నమ్మించి 12 ఏళ్లుగా ఫించన్ తీసుకుంటున్నాడు మృతుడు పారా కిరీటి కుమారుడు సారయ్య. 2001లో చనిపోయిన తన తండ్రి స్థానంలో మరొక వ్యక్తిని చూపిస్తూ ప్రభుత్వాన్ని మోసం చేస్తూ పెన్షన్ అందుకుంటున్నట్లు మృతుడి బంధువులు జాయింట కలెక్టర్‌కి ఫిర్యాదు చేశారు. అతను 2011లో తన మామ చనిపోతే..అతడిని తండ్రిగా చూపించి నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి ఫించన్‌కు దరఖాస్తు చేస్తే అధికారులు ఫించన్ మంజూరు చేసేశారు. దీంతో అతడు ధర్జాగా గత 144 నెలలుగా మోసం చేస్తూ సుమారుగా 4 లక్షల రూపాయలు ప్రభుత్వ సొమ్మును పారా సౌరయ్య కాజేసినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై విచారణ చేపట్టాలని డీడీవో మహాలక్ష్మిని జేసీ శ్యాంప్రసాద్ ఆదేశించారు. ఇన్నేళ్లుగా పింఛన్ తీసుకుంటున్నా అధికారులకు మాత్రం దొరకలేదు. (చదవండి: సత్తా చాటిన గుంటూరు జిల్లా ఎడ్లు) -
పెన్షన్.. పరేషాన్! నగదు జమ కాక లబ్ధిదారుల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: ఆసరా పింఛన్లకు తిప్పలు తప్పడం లేదు. తాజాగా బ్యాంక్ ఖాతాలకు కేవైసీ ప్రక్రియ చిక్కుముడిగా తయారైంది. బ్యాంకు ఖాతాల ద్వారా కొంత కాలంగా ఆసరా పింఛన్ పొందుతున్న లబ్ధిదారులు కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోవడంతో రెండు, మూడు నెలలుగా పింఛన్ సొమ్ము జమకాని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఆధార్ అప్డేట్ సమస్య కూడా వెంటాడుతోంది. లబ్ధిదారులు తహసీల్ ఆఫీసు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా సమస్యకు సరైన సమాధానం లభించని పరిస్థితి నెలకొంది. దీంతో పేదలు పింఛన్ల కోసం ఆందోళన చెందుతున్నారు. కార్డుల పంపిణీలో నిర్లక్ష్యమే ఆసరా పింఛన్ గుర్తింపు కార్డుల పంపిణీలో తీవ్ర నిర్లక్ష్యం నెలకొంది. ఇటీవల కొత్తగా పింఛన్లు మంజూరైన వారిలో పాటు పాత లబ్ధిదారులకు సైతం ప్రభుత్వం ఆసరా గుర్తింపు కార్డులను ముద్రించింది. లబి్ధదారులు ఇళ్లు మారడంతో పాటు పంపిణీకి చిరునామా సమస్య తలెత్తింది. దీంతో సగానికి పైగా కార్డులు తహసీల్దార్ కార్యాలయాల్లోనే మూలుగుతున్నాయి. కనీసం వార్డుల సమావేశాలు నిర్వహించి పంపిణీ చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. కేవలం ఎమ్మెల్యేల ద్వారా కొన్ని కార్డులు పంపిణీ చేసి చేతులు దులుపుకొన్నారు. ఇటీవల 65 ఏళ్ల వృద్ధులతో పాటు 57 ఏళ్లు నిండిన వారికి కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరయ్యాయి. తహసీల్దార్ కార్యాలయాల్లో ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారితో పాటు గతేడాది మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు పెట్టుకున్న అర్హులకు ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేసి బ్యాంకు ఖాతాలో నగదు జమ చేస్తోంది. బ్యాంక్ ఖాతాకు కేవైసీ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ప్రధాన సమస్యగా పరిణమించింది. చదవండి: Revanth Reddy: రేవంత్‌రెడ్డి కొత్త పార్టీ?.. కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం.. -
Telangana: ఆసరా ఆలస్యం.. కొన్ని జిల్లాల్లో రెండు మూడు నెలలు కూడా!
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో ఆసరా ఆలస్యమవుతోంది. పింఛన్ల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. ప్రతినెలా మొదట్లోనే అందాల్సిన సొమ్ము కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. కొన్ని జిల్లాల్లో రెండు మూడు నెలలు ఆలస్యంగా పింఛన్ డబ్బులు ఇస్తుంటే.. మరికొన్ని చోట్ల మరింత ఆలస్యంగా చెల్లింపులు జరుగుతున్నాయి. దీనితో పింఛన్‌పై ఆధారపడి బతుకీడుస్తున్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర వర్గాల వారు ఇబ్బంది పడుతున్నారు. మందులు, ఇతర నెలవారీ అవసరాలు తీరక అవస్థల పాలవుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. లబ్ధిదారుల్లో కొందరికి పోస్టాఫీస్ ద్వారా, మరికొందరికి బ్యాంక్ అకౌంట్ల ద్వారా పింఛన్ సొమ్ము అందుతుంది. దీనితో పలు ప్రాంతాల్లో వృద్ధులు పింఛన్ సొమ్ము జమ అయిందో, లేదో తెలుసుకునేందుకు పోస్టాఫీసుల చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్తగా మంజూరు చేసినా.. రాష్ట్రంలో ఆసరా పథకం కింద వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, హెచ్ఐవీ, ఫైలేరియా బాధితులు, చేనేత, కల్లుగీత, బీడీ కార్మికుల కేటగిరీల్లో మొత్తంగా 35,95,675 మందికి పింఛన్లు అందేవి. ఇటీవల ప్రభుత్వం కొత్తగా మరింత మందికి పింఛన్లు మంజూరు చేసింది. వృద్ధాప్య పింఛన్ వయసును 57 ఏళ్లకు తగ్గించడంతో మరో 11 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అప్పటికే వివిధ కేటగిరీల పింఛన్ కోసం వచ్చిన మరో 3 లక్షల దరఖాస్తులు కలిపి.. మొత్తంగా 14 లక్షల దరఖాస్తులు అయ్యాయి. ఇందులో ప్రభుత్వం ఇటీవల కొత్తగా 9.38 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేసింది. దీనితో మొత్తంగా లబ్ధిదారుల సంఖ్య అక్టోబర్ చివరినాటికి 44,14,915 మందికి చేరింది. మరో 4.6 లక్షల మంది పింఛన్ మంజూరు కోసం ఎదురు చూస్తున్నారు. అందక.. మంజూరుగాక.. తెలంగాణ ఏర్పడే నాటికి నెలకు రూ.200గా ఉన్న పింఛన్ల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు రూ.3,016కు.. వృద్ధులు, వితంతువులు ఇతర కేటగిరీల్లో రూ.2,016కు పెంచింది. దీనితో పెద్ద సంఖ్యలో ప్రజలకు ఉపశమనం కలిగింది. నెలవారీ మందులు, నిత్యావసరాలకు కష్టం తీరింది. కానీ ఇటీవల ఆసరా పింఛన్ల సొమ్ము అందడంలో జాప్యం జరుగుతుండటంతో ఇబ్బంది మొదలైంది. వృద్ధాప్య పింఛన్ అర్హత వయసును ప్రభుత్వం 57 ఏళ్లకు తగ్గించినా.. ఆ కేటగిరీలో దరఖాస్తు చేసుకున్నవారిలో కొన్ని లక్షల మందికి ఇంకా మంజూరు కాలేదు. మంజూరు అయినవారిలోనూ కొందరికి పింఛన్ సొమ్ము అందడం లేదని వాపోతున్నారు. వృద్ధుల వేలిముద్రలు అరిగిపోవడం, బ్యాంకు ఖాతాల్లో మార్పులు, ఆధార్‌తో అనుసంధానం వంటి సమస్యలతోనూ పింఛన్లు సరిగా అందని పరిస్థితి నెలకొంది. ఆసరా పింఛన్ల పంపిణీలో జాప్యం, ఇతర అంశాలపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ సమస్యలను గుర్తించింది. పలు జిల్లాల్లో సమస్యలివీ.. ► సూర్యాపేట జిల్లాలో గత ఐదు నెలలుగా 25వ తేదీ తర్వా పింఛన్ల సొమ్ము అందుతోంది. అక్టోబర్ పింఛన్ సొమ్ము ఇప్పటికీ అందలేదని లబ్ధిదారులు చెప్తున్నారు. 57 ఏళ్లు దాటినవారి వృద్ధాప్య పింఛన్ల కోసం 30వేలకుపైగా దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి. కొత్తగా మంజూరైన వారిలోనూ కొందరికి సొమ్ము రావడం లేదు. ► కరీంనగర్ జిల్లాలో కొత్తగా పింఛన్ మంజూరైన వారిలో 4 వేల మంది వరకు ఇంకా సొమ్ము అందడం లేదు. ఇదేమిటంటే వివరాలు అసమగ్రంగా ఉన్నాయని, మీసేవ వాళ్లు తప్పుగా నమోదు చేశారని చెప్తూ అధికారులు చేతులు దులుపుకొంటున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. ► ఉమ్మడి వరంగల్ జిల్లాలో 4,61,988 మందికి ఆసరా పింఛన్లు అందుతున్నాయి. కొత్తగా వృద్ధాప్య పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నవారిలో వేల మంది ఇంకా మంజూరు కోసం ఎదురుచూస్తున్నారు. మంజూరైన పింఛన్లలోనూ బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్, ఇతర సమస్యలతో కొందరిని పింఛన్ సొమ్ము అందడం లేదు. ఇక భార్యాభర్త ఇద్దరికీ పెన్షన్ ఉండటం, సొంత ఇళ్లు, వాహనాలు ఉండటం వంటి కారణాలతో కొందరి పింఛన్లను తొలగించారు. ► ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పింఛన్ సొమ్ము ఆలస్యంగా అందుతోందని లబ్ధిదారులు చెప్తున్నారు. అర్హత ఉన్నా తమకు మంజూరుకావడం లేదని వాపోతున్నవారు వేలలో ఉన్నారు. గోస పడుతున్నం ఈమె పేరు భూతం రాములమ్మ. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం కోటపహాడ్ గ్రామం. వయసు 85ఏళ్లు. భర్త, పిల్లలు ఎవరూ లేరు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆసరా పింఛనే దిక్కు. ఈ సొమ్ము నెల నెలా సమయానికి అందడం లేదని, ఖర్చుల కోసం ఇబ్బంది అవుతోందని ఆమె వాపోతోంది. ప్రతీ నెల మొదటివారంలో పింఛన్ పంపిణీ చేయాలని కోరుతోంది. మంజూరై రెండు నెలలైనా.. ఈ వ్యక్తి పేరు సంక రాజేందర్. జగిత్యాల జిల్లా సిరికొండ గ్రామం. కిడ్నీ వ్యాధి బాధితుడు. రెండు నెలల కింద డయాలసిస్ కేటగిరీలో పింఛన్ మంజూరైంది. గుర్తింపు కార్డు సైతం ఇచ్చారు. కానీ ఇప్పటివరకు పింఛన్ డబ్బులు రావడం లేదని వాపోతున్నాడు. -
EPFO: ఇక ఎక్కడి నుంచైనా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్
న్యూఢిల్లీ: వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ పీఫ్ ఆఫీస్‌లకు వచ్చి లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించలేని పెన్షనర్లకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌వో) కొత్త వెసులుబాటు కల్పించింది. ఇకపై ఎక్కడి నుంచైనా సరే ఫేస్ రికగ్నిషన్ అథెంటికేషన్ సాయంతో డిజిటల్ రూపంలో లైఫ్ సర్టిఫికెట్‌ను పంపేందుకు అనుమతినిస్తూ ఈపీఎఫ్‌వో నిర్ణాయక మండలి నిర్ణయం తీసుకుంది. దీంతో 73 లక్షల మంది పెన్షనర్లలో ఇల్లు విడిచి బయటకు రాలేని వృద్ధులకు లబ్ధి చేకూరనుంది. పెన్షనర్ల కోసం కొత్తగా ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని కేంద్ర కార్మిక మంత్రి భూపేందర్ యాదవ్ ప్రారంభించారు. దీంతోపాటు పెన్షన్, ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకానికి సంబంధించిన కాలిక్యులేటర్‌ను అందుబాటులోకి తెచ్చారు. స్కీమ్ ప్రయోజనాలను పెన్షనర్, కుటుంబ సభ్యులు ఈ కాలిక్యులేటర్ ద్వారా తెల్సుకోవచ్చు. మరోవైపు, ఈపీఎఫ్‌వో సెక్యూరిటీస్‌కు కస్టోడియన్‌గా సిటీ బ్యాంక్‌ను ఎంపిక చేస్తూ పీఎఫ్ నిర్ణాయక మండలి సీబీటీ నిర్ణయం తీసుకుంది. -
నేపాలీకి వృద్ధాప్య పింఛన్
రావికమతం: అర్హుడైతే చాలు కులాలు చూడం, మతాలు చూడం అన్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మాటలు.. విశాఖ జిల్లాలో అర్హుడైన నేపాల్ జాతీయునికీ మేలు చేశాయి. గ్రామ సర్పంచ్ చొరవతో సోమవారం అతనికి పింఛన్ అందింది. నేపాల్ జాతీయుడైన సాంబ అనే 61 ఏళ్ల వృద్ధుడు కాశ్మీర్లో ఉండేవాడు. విశాఖ జిల్లా రావికమతం మండలం గుడ్డిప గ్రామం నుంచి ఏటా పలువురు గ్రామస్తులు కూలి పనులకు కశ్మీర్ వెళ్తుంటారు. ఇక్కడి యువకులకు సాంబ అక్కడ పరిచయమై వీరిలో ఒక్కడిగా కలిసిపోయాడు. ఇది పాతికేళ్ల క్రితంనాటి మాట. అతనికి వివాహం కాలేదు. ఏటా సంక్రాంతికి కూలీలు ఇక్కడికి వచ్చేటపుడు సాంబ కూడా వారితో వచ్చి ఇక్కడ యలంశెట్టి శ్రీనివాసరావు కుటుంబంతో కలిసి ఉండేవాడు. వయస్సు మళ్లడంతో కొన్నేళ్లుగా కూలి పనులకు కశ్మీర్ వెళ్లడంలేదు. ఇక్కడే యలంశెట్టి వారింట్లో ఉంటూ చిన్నాచితక పనులు చేసుకుంటున్నాడు. సాంబకు యలంశెట్టి ఇంటి పేరుతో రేషన్ కార్డు మంజూరైంది. అయితే, వృద్ధాప్యంలో కూలికి వెళ్లని రోజున అతను పస్తులుండడంతో వైఎస్సార్సీపీ మద్దతుదారుడైన సర్పంచ్ గుమ్మాల గణేశ్వరరావు అతని దుస్థితికి చలించిపోయారు. అధికారులకు విషయం చెప్పి వృద్ధాప్య పింఛన్‌కు అతనితో దరఖాస్తు చేయించారు. ప్రభుత్వం పరిశీలించి మంజూరు చేసింది. సర్పంచ్ గణేశ్వరరావుతోపాటు అధికారులు, గ్రామ నాయకులు అతనికి సోమవారం పింఛన్ అందించారు. దీంతో సాంబ ఆనందానికి అవధుల్లేవు. -
కొంత ఖర్చవుతుంది.. ముందుగా వెయ్యి ఇవ్వండి.. తరువాత!
సంతోష్‌నగర్‌కు చెందిన నాగరాజు ఇటీవల మీ సేవ కేంద్రం ద్వారా వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అది తెలిసిన ఇద్దరు దళారులు నాగరాజును సంప్రదించి..‘వయసు సడలించడంతో చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. సర్కారు స్క్రూట్నీని కఠినంగా ఉంటుంది. అర్హత సాధించడం కష్టం. మీసేవలో సమర్పించిన దరఖాస్తు కాపీ మాకిస్తే తహసీల్ ఆఫీస్‌లో పైరవీ చేసి ముందుగానే మార్గం సుగమం చేస్తాం. ఇందుకు కొంత ఖర్చవుతుంది. ముందుగా రూ.వెయ్యి ఇవ్వండి. మంజూరైనంక రెండు నెలల పింఛన్ ఇవ్వాలి’ అని మౌఖిక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇలా నగరంలో దళారులు పింఛన్ అర్హులను బుట్టలో వేసుకుని దండుకుంటున్నారు. సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో ఆసరా కొత్త పింఛన్ల దందా గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. కొందరు చోటా నేతలు, గల్లీ లీడర్లు, నిరుద్యోగులు దళారులుగా అవతారమెత్తి దరఖాస్తుదారుల అమాయకత్వం, అవసరాలను సొమ్ము చేసుకుంటున్నారు. మీ–సేవ కేంద్రాల ద్వారా వృద్ధాప్య పించన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను తెలుసుకొని గాలం వేస్తున్నారు. కొందరు దరఖాస్తుదారులను స్వయంగా కలుస్తుండగా, మరి కొందరు ఫోన్ల ద్వారా సంప్రదించి ‘అన్నీ మేమే చూసుకుంటాం’ అని భరోసా ఇస్తున్నారు. కొంత నగదు లంచంగా ఇవ్వాలని చెబుతున్నారు. కేవలం దరఖాస్తు మాత్రమే చేస్తే సరిపోదని, పోటీ చాలా ఉందని చెబుతున్నారు. దరఖాస్తుదారులు సైతం పింఛను మంజూరు కాదేమోనన్న భయంతో దళారుల మాటల్ని నమ్మి వారు అడిగినంత ముట్టచెబుతున్నారని తెలుస్తోంది. దండిగా దరఖాస్తులు ఆసరా పథకం కింద వృద్ధాప్య పింఛన్ల వయసును 60 ఏళ్ల నుంచి సడలించడంతో మీ సేవ కేంద్రాల ద్వారా ఆన్లైన్లో దండిగా దరఖాస్తులు నమోదయ్యాయి. 57 ఏళ్లు దాటిన వారు పోటీపడి మరి దరఖాస్తులు సమర్పించారు. ఇప్పటి వరకు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోని పండుటాకులు సైతం ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తుల నమోదు ఉచితం కావడంతో నిరుపేదలు (బీపీఎల్) తోపాటు మద్య, సంపన్న(ఏపీఎల్) వర్గాలు సైతం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్–రంగారెడ్డి– మేడ్చల్ జిల్లాల్లో కలిపి సుమారు రెండు లక్షలకు పైగా దరఖాస్తులు నమోదైనట్లు ఆన్లైన్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వాస్తవంగా ఆసరా పింఛన్లకు ఇప్పటి వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించలేదు. తహాసీల్ ఆఫీసుల్లో దరఖాస్తు సమరి్పస్తే విచారణ జరిపి మంజూరు చేసేవారు. తాజాగా వయసు సడలించడంతో ఆన్లైన్ ద్వారా స్వీకరించగా కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చి పడ్డాయి. స్పష్టత ఏదీ? ఆసరా దరఖాస్తులపై స్పష్టత లేకుండా పోయింది. దరఖాస్తుతోపాటు ఆధార్ కార్డు, చిరునామా గుర్తింపు, ఓటరు ఐడీ, బ్యాంక్ పాస్ బుక్ వివరాల నమోదుతోపాటు వాటి ప్రతులను సమర్పించాలన్నారు. కానీ ఎక్కడ సమర్పించాలో పేర్కొనలేదు. దీంతో దరఖాస్తుదారులు అయోమయానికి గురవుతున్నారు. తహసీల్ ఆఫీస్‌కు వెళ్తే అక్కడ తీసుకోవడం లేదు. మీ సేవ కేంద్రాల్లోనూ జిరాక్స్ ప్రతులు తీసుకోవడం లేదు. ఈ అంశం కూడా దళారులకు కలిసి వస్తోంది. ఆ ప్రతులను దళారులు తీసుకొని దరఖాస్తుదారుల్లో ఆశలు నింపుతున్నారు. పింఛన్ల మంజూరుపై క్షేత్ర స్థాయి విచారణ కఠినంగా ఉంటుందని భయపెడుతూ దండుకుంటున్నారని విమర్శలు విన్పిస్తున్నాయి. -
ఆసరా.. అందేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్ అర్హత వయసును 57 ఏళ్లకు తగ్గించినా, దరఖాస్తుదారులకు మార్గదర్శకాలతో ఇబ్బందులు తప్పడం లేదు. తగ్గించిన అర్హత వయసుతో పింఛన్‌కు దర ఖాస్తు చేసుకునేందుకు గడువు మంగళవారంతో ముగియనుంది. వయసు ధ్రువీకరణకు మున్సిపల్ బర్త్ సర్టిఫికెట్, స్కూల్ టీసీ, ఓటర్ గుర్తింపు కార్డు ల్లో ఏదో ఒకటి జతచేయాలనేది నిబంధన. అయితే ఈ పత్రాలు లేని వారు తమ దరఖాస్తులను మీ–సే వా కేంద్రాల్లో అప్లోడ్ చేయలేకపోతున్నారు. ఈ ప త్రాల్లో ఏదో ఒకటి ఉంటేనే దరఖాస్తు అప్లోడ్ అ య్యేలా అధికారులు ఏర్పాట్లు చేయడంతో లబ్ధిదా రులకు ఇబ్బందులు తప్పడంలేదు. గ్రామీణ ప్రాం తాల్లో చాలా మంది చదువుకోని వారే కావడంతో పుట్టిన ధ్రువీకరణపత్రం, టీసీలు లేవు. అలాంటి వారికి ఓటరు గుర్తింపు కార్డే ఆధారం. అయితే ప్రస్తు తం సంబంధిత వెబ్సైట్ నుంచి ఓటర్ గుర్తింపు కార్డు తీసుకునే వెసులుబాటు లేకపోవడం ఇబ్బందిగా మారింది. ఆ వెబ్‌సైట్‌ను నిలిపివేసినట్లు మీ–సేవ కేంద్రాల నిర్వాహకులు చెబుతుండటంతో దరఖాస్తుదారులు అయోమయంలో ఉన్నారు. పింఛన్ల మార్గదర్శకాలివే... ►నిర్ణీత నమూనాకు అనుగుణంగా ఈ–సేవా/మీ–సేవా సెంటర్లలో దరఖాస్తు చేసుకోవాలి. ►అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు గడువు తేదీ ఆగస్టు 31. ►జీవో 75లో పొందుపరిచినట్లు.. మున్సిపల్ అధికారులు జారీచేసిన పుట్టినరోజు ధృవీకరణ పత్రం లేదా జనన, మరణాల రిజిస్ట్రార్ జారీచేసిన సర్టిఫికెట్ లేదా బర్త్‌డే సర్టిఫికెట్ జారీచేసే అధికారమున్న వారు ఇచ్చే పత్రం. (లేదా) స్కూల్ నుంచి పాసై వచ్చేటప్పుడిచ్చే టీసీ/ సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్/ స్కూళ్లు, గుర్తింపు పొందిన బోర్డులు జారీ చేసే సర్టిఫికెట్/ గుర్తింపు పొందిన విద్యాసంస్థలిచ్చే సర్టిఫికెట్. (లేదా) ఓటర్ల జాబితా/ ఓటర్ ఐడీ కార్డు. ►2014, నవంబర్‌లో జారీ చేసిన జీవో 17, జీవో 23 ప్రకారం అర్హతల వర్తింపు. నాకు పింఛన్ ఇప్పించండి నాకు ఇల్లు లేదు. అద్దె ఇంట్లో ఉంటున్నా. నా వయసు 70 ఏళ్లు. ఆసరా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవడం కోసం మీ–సేవ కేంద్రానికి వెళ్లా. ఎన్నికల గుర్తింపు కార్డు అడిగారు. అది నా దగ్గర లేకపోవడంతో దరఖాస్తు చేయలేకపోయా. నా భార్య 12 ఏళ్ల క్రితం, నా కొడుకు ఇటీవల చనిపోయారు. నా బిడ్డ 19 ఏళ్ల మౌనికతో కలిసి జీవిస్తున్నా. నాకు పింఛన్ ఇప్పించాలని సర్కార్‌ను విజ్ఞప్తి చేస్తున్నా. – ఆకుల విష్ణుమూర్తి, రాయికల్, జగిత్యాల జిల్లా ఓటరు కార్డు పోయింది నేను గొర్లు కాసుకుంటూ జీవితం గడుపుతున్నా. నాకు 70 ఏళ్లు దాటాయి. ఓటరు గుర్తింపు కార్డు పోయింది. మీ–సేవ కేంద్రానికి వెళితే.. ఓటరు గుర్తింపు కార్డు లేకుంటే ఆసరా పింఛన్ రాదని చెబుతున్నారు. సీఎం కేసీఆర్ పట్టించుకుని పింఛన్ ఇప్పించాలి. – లక్కం కిష్టయ్యయాదవ్ వెబ్సైట్ నిలిచిపోయింది ఆసరా పింఛన్ కోసం ఓటరు గుర్తింపు కార్డు తప్పనిసరి అని ప్ర భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, ఓటర్ గుర్తింపు కార్డు డౌన్లోడ్ చేసుకునే వెబ్సైట్ నిలిచిపోయింది. దరఖాస్తు చేసుకునేందుకు వచ్చినవారు కార్డు డౌన్లోడ్ కాకపోవడంతో నిరాశతో వెనుదిరిగిపోతున్నారు. – షబీల్, మీ–సేవ నిర్వాహకుడు -
త్వరలో 57ఏళ్లకే పింఛన్
సాక్షి, బాల్కొండ: గత సాధారణ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హమీ మేరకు త్వరలోనే 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్ అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. గురువారం ముప్కాల్ మండలం నల్లూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యాక్రమాలను కలెక్టర్ రామ్మోహన్‌రావుతో కలిసి ప్రారంభోత్సవం, శంకు స్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే 57ఏళ్లు నిండిన వారికి పింఛన్ అందించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను చేస్తుందన్నారు. ప్రస్తుతం కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీరు అందించాలని లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్ట్‌ల నిర్మాణం పూర్తి చేయడంలో కేసీఆర్ నిమగ్నమై ఉన్నారన్నారు. అందులో కాళేశ్వరం ప్రధాన ప్రాజెక్ట్ అన్నారు. ఆ ప్రాజెక్ట్ కోసం నిధులు ఎక్కువగా వెచ్చించడం వల్ల ప్రస్తుతం ఇతర పనులు చేపట్టలేక పోతున్నామన్నారు. త్వరలోనే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడుతామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయితే ఎస్సారెస్పీ ఆయకట్టుకు డోకా ఉండదన్నారు. ఇది వరకే కాళేశ్వరం నీళ్లు ఎస్సారెస్పీని ముద్దాడాయన్నారు. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల నుంచి నీరు రావడం వల్ల కాళేశ్వరం నీళ్లు అవసరం లేకుండా పోయిందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి నీరు రానప్పుడు కాళేశ్వరం నీళ్లు ఎంతో అవసరం ఉంటుందన్నారు. నల్లూర్పై మంత్రి నారాజ్.. నల్లూర్ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఓట్లపై మంత్రి నరాజ్ అయ్యారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామంలో 412 మంది రైతుబంధు, 500 మంది పింఛన్లు పొందుతున్నారన్నారు. 912మంది రాష్ట్ర ప్రభుత్వం వలన ప్రయోజనం పొందిన టీఆర్ఎస్ పార్టీకి గత ఎన్నికల్లో 200 ఓట్లు మాత్రమే వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సేవాకుడిగా ప్రజలను నుంచి కోరుకునేది ఓటు మాత్రమే అన్నారు. ప్రజలు ఎక్కువగా ఓట్లు వేస్తే మరింత ఉత్సాహంతో పని చేస్తామన్నారు. గ్రామాన్ని అభివృద్ధి చేస్తా.. నల్లూర్ గ్రామంలో ఇది వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టమన్నారు. భవిష్యత్తులో గ్రామానికి మరింత అభివృద్ధి చేస్తామన్నారు. గ్రామంలో లో వోల్టేజీ సమస్య తీర్చడం కోసం విద్యుత్తు సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం కృషి చేస్తానన్నారు. గ్రామంలో లైబ్రరీ భవనం నిర్మించామన్నారు. కావాల్సిన పుస్తకాలను జిల్లా కలెక్టర్ నిధుల నుంచి మంజూరు చేయుటకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ముప్కాల్ మండల ఎంపీపీ సామ పద్మ, జెడ్పీటీసీ బద్దం నర్సవ్వ, వైస్ ఎంపీపీ ఆకుల చిన్నరాజన్న, స్థానిక సర్పంచ్ సుగుణ, ఎంపీటసీ సత్యనారయణ, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, మండల అధ్యక్షుడు ముస్కు భూమేశ్వర్, ఆర్డీవో శ్రీనివాస్, ఎంపీడీవో దామోదర్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
వృద్ధుల కడుపు కొడుతున్న తెలుగు తమ్ముళ్లు
-
పింఛన్ కోసం మాజీ సర్పంచ్ ఆత్మహత్య
తాడ్వాయి: వృద్ధాప్య పింఛన్ రావడం లేదని మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. తాడ్వాయి మండలం దేవాయిపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పైడి నర్సింహారెడ్డి(65) గురువారం రాత్రి మండల పరిషత్ కార్యాలయం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రోజు మాది రిగానే మండల పరిషత్ అటెండర్ కార్యాలయం వచ్చి తాళం తీసే సమయంలో నర్సింహారెడ్డి శవాన్ని గుర్తించాడు. అనంతరం అధికారులకు సమాచారం అందించాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ విషయమై ఎంపీడీవో లక్ష్మిని సంప్రదించగా నర్సింహారెడ్డి దేవాయిపల్లి గ్రామంలో ఉండడం లేదని, హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడన్నారు. స్థానికంగా ఉన్నట్లు ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో పింఛన్ ఇప్పించలేక పోయామన్నారు. -
అమ్మా..’ భిక్షాం దేహి...
► కుమారులు పట్టించుకోకపోవడంతో వృద్ధురాలి తిప్పలు పెంబర్తి(జనగామ) : నవమాసాలు పెంచి, పోషించిన తల్లి వృద్ధ్యాపానికి వచ్చే సరికి పిల్లలు ప్రయోజకులవుతారు. ఈ నేపథ్యం లో వారిపై తల్లిని కళ్లలో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అయితే ఇద్దరు కొడుకులు, ఇందులో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా... తల్లిని పట్టించుకోకపోవడంతో ఆమె గ్రామంలో భిక్షాటన చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఉదయం భిక్షాటనతో కడుపు నింపుకుం టూ రాత్రి గ్రామపంచాయతీ ఆవరణలో ఐదు రోజులుగా తలదాచుకుంటున్న జనగామ మండలం పెంబర్తికి చెందిన దైద పద్మ వ్యధ ఇది. పద్మ భర్త 20 ఏళ్ల క్రితమే కన్నుమూయగా ఇద్దరు కుమారుల ను ఆమె పెంచి పోషించింది. ఈ మేరకు పెద్దకుమారుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండగా, మరో కుమారుడు హమాలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలం పద్మకు వృద్ధాప్య పింఛన్ వచ్చినా కుమారుడు ప్రభుత్వ ఉద్యోగి అనే కారణంగా తర్వాత నిలిపివేశారు. తాజాగా తన వద్ద తల్లిని చిన్నకుమారుడు.. పెద్దకుమారుడి వద్దకు వెళ్లాలని పంపిస్తే ఆయన రానివ్వలేదు. దీంతో ఏం చేయాలో పాలుపోని వృద్ధురాలు పద్మ విధిలేని పరిస్థితు ల్లో గ్రామపంచాయతీలోని ఓ బెంచీపై పడుకుంటూ కాలం వెళ్లదీస్తోం ది. ఆమె దీనస్థితి చూడలేక స్థానికులు భోజనం పెడుతుండగా.. ఎవరూ పెట్టకపోతే ఆమె వెళ్లి భోజనం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా పద్మ విలేకరులతో మాట్లాడుతూ ‘గింత బువ్వ.. పడుకునేం దుకు ఓ మూలన జాగా ఉంటే చాలు.. అంత కంటే నాకేం కావాలె బిడ్డా.. అంటూ చెమర్చిన కళ్లతో చెప్పుకోవడం మిగతా వారిని కదలించింది. -
బీడీ కట్ట చూస్తే పింఛను నిలిపేస్తా
చిత్తూరు : తాతయ్యా నేను కలెక్టర్‌ని, మీకు పింఛను ఇస్తున్నారా ? వెయ్యి రూపాయిలు కరెక్టుగా ఇస్తున్నారా ? పిల్లలు ఎంత మంది ? ఏమీ చేస్తున్నారు ? అంటూ జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ ఓ వృద్ధుడిని ఆప్యాయంగా పలుకరించారు. సోమవారం కార్వేటినగరంలో ఓ కల్వర్టుపై కూర్చుని ఉన్న వృద్ధుడు చెంగయ్య వద్దకు కలెక్టర్ వెళ్లారు. కుశల ప్రశ్నలు వేశారు. అతని జేబులో ఉన్న బీడీల కట్టను తీసుకున్నారు. పింఛను ఇచ్చేది బీడీలకు కాదు' అని కలెక్టర్ అనడంతో అక్కడే ఉన్నవారంతా నవ్వేశారు. అలవాటైంది. వదులుకోలేకపోతున్నా సార్ అంటూ బదులుచ్చాడు. అయితే పింఛనుకు బదులు బీడీలు ఇస్తామని కలెక్టర్ అనగానే... వద్దు సార్ వెయ్యి రూపాయిలు లేదంటే ప్రాణాలు వదులుకోవాల్సిందేనన్నారు. దాంతో కలెక్టర్ 'ఎప్పుడైనా ఈ దారిలో వస్తా, జేబులో బీడీ కట్ట చూస్తే పింఛను నిలిపేస్తానని నవ్వుతూ హెచ్చరించారు. -
నిత్యశ్రామికురాలు....
కోహీర్: ఆమెకు మహిళల హక్కులు తెలియవు, మహిళా దినోత్సవాలు అసలే తెలియవు. ఆమెకు తెలిసిందల్లా రోజంతా కష్టపడి సంపాదించి తాను బుక్కెడు బువ్వతిని అంగవికలుడైన తన కొడుకుకు పట్టెడన్నం పెట్టడం మాత్రమే. అంతమ్మకు ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు పెళ్లి చేసుకొని వేరు కాపురం పెట్టాడు. చిన్నకొడుకు ప్రమాదంలో కన్ను కోల్పోయి అంగవికలుడై పనిచేయలేకపోతున్నాడు. ఏడు పదుల వయసులోనూ అంతమ్మ నిత్యం శ్రమిస్తూనే ఉంటుంది. వృద్ధాప్య పింఛను వస్తున్నా కుటుంబ పోషణకు చాలడంలేదు. పని దొరకపోతే పస్తులుండాల్సిన దుస్థితి.. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రోజూ ఏదో ఒక పని చేస్తోంది. మంగళవారం పండుగపూట పని దొరకకపోవడంతో కానుగకాయ (జట్రోప) ఏరి డబ్బులు సంపాంచాలనుకొంది. తన మిత్రురాలు పెంటమ్మతో కలిసి కోహీర్ గ్రామానికి వచ్చింది. యువకులు సైతం ఎక్కడానికి భయపడే ఎత్తై కానుగ చెట్టు ఎక్కి రెండు చేతులతో కట్టె పట్టుకొని కాయలు రాల్చింది. వచ్చిపోయే ప్రజలు అంతమ్మ ధైర్యానికి హ్యాట్సాఫ్ తెలిపారు. -
నేను బాలుడిని కాను మొర్రో..!
అతడి భార్యకు 70 ఏళ్లు. అతడి వయసు మాత్రం ఏడేళ్లే. ఏమిటీ విచిత్రం అనుకుంటున్నారా.. రెవెన్యూ అధికారుల పుణ్యమా అని రేషన్ కార్డులో అలాగే ఉంది మరి! కోరుకొండ మండలం బొల్లెద్దుపాలెం గ్రామానికి చెందిన 80 ఏళ్ల మంగం సూర్యారావు తనకు పింఛను ఇప్పించాలని అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నాడు. సోమవారం కోరుకొండ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజావాణిలో పింఛను కోసం దరఖాస్తు చేశాడు. రేషన్‌కార్డులో తనకు ఏడేళ్లు అని వేయడం వల్ల పింఛను రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు 2012లో రేషన్‌కార్డు మంజూరైందని పేర్కొన్నాడు. ప్రస్తుతం తనకు 80, తన భార్యకు 70 ఏళ్ల వయసు ఉందన్నాడు. ప్రతివారం రెవెన్యూ, మండల పరిషత్, సబ్‌కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా పింఛను మంజూరు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కాలు కదపడం కష్టంగా ఉన్న తనకు వృద్ధాప్య పింఛను మంజూరు చేయాలని అధికారులను వేడుకున్నాడు. - కోరుకొండ -
పింఛన్ కోసం వచ్చి.. వృద్ధుడి మృతి
హైదరాబాద్ పింఛన్ కోసం కాళ్లరిగేలా తిరిగిన సత్తయ్య అనే వృద్దుడు కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. నాలుగైదు సార్లు తిప్పిన అధికారులు ఇంకో జాబితా వస్తుంది రమ్మని పిలిచారు. ఆఫీసు 10 గంటలకు తెరుస్తారంటే.. ఎక్కడ పింఛను రాదోనని ఉదయం 7 గంటలకే వచ్చి క్యూలో నిల్చున్నాడు. చివరకు అక్కడా ఆలస్యం చేయడంతో.. అక్కడే కుప్పకూలాడు. ఎల్బీ నగర్ కొత్తపేట పింఛన్ కేంద్రంలో ముత్తం సత్తయ్య (70) అనే వృద్ధుడు రెండు రోజుల కింద పింఛన్ కోసం వచ్చి అధికారులను సంప్రదించగా, మరుసటి జాబితాలో పేరు వస్తుందని చెప్పారు. మళ్లీ దరఖాస్తు చేసుకోవాలన్నారు. దీంతో సత్తయ్య నాగోలు న్యూమారుతీనగర్ లోని మహిళా భవన్లో ఉదయం 7 గంటలకే వచ్చి పింఛన్ కోసం క్యూలో నిలుచున్నాడు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు క్యూలోనే ఉండాల్సి రావడంతో అక్కడే కుప్పకూలాడు. దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే సత్తయ్య మరణించారని డాక్టర్లు ధ్రువీకరించారు. -
పింఛన్ పోయింది.. గుండె ఆగింది!
కొత్తూరు: సెంటు భూమి కూడా లేని అతనికి పింఛన్ సర్వే కమిటీ సభ్యులు ఏకంగా ఐదు ఎకరాలు ఉన్నట్టు రికార్డుల్లో నమోదు చేశారు. ఫలితంగా సుమారు పదేళ్లుగా తీసుకుంటున్న వృద్ధాప్య పింఛన్‌ను అధికారులు నిలిపివేశారు. దీంతో మనస్తాపానికి గురైన ఆయన గుండె ఆగిపోయింది.. కుటుంబ సభ్యులను ఆవేదనకు గురి చేసింది. ఈ విషాద ఘటన కొత్తూరు మండలంలోని సిర్సువాడలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నక్క ఎండు (68)కు సెంటు భూమి కూడా లేదు. ఇతను సుమారు పదేళ్లుగా వృద్ధాప్య పింఛన్‌ను అందుకుంటున్నాడు. ఇటీవల టీడీపీ సర్కార్ పింఛన్‌ను వెయ్యి రూపాయలకు పెంచడంతో అతనితోపాటు కుటుంబ సభ్యులు కూడా సంబరపడిపోయూడు. అయితే ఇటీవల ప్రభుత్వం పింఛన్ల సర్వేను చేపట్టింది. ఈ క్రమంలో సెంటు భూమి కూడా లేని ఎండు పేరున ఐదు ఎకరాలు ఉన్నట్టు సర్వే బృందాలు రికార్డుల్లో నమోదు చేయడంతో అతని పింఛన్‌ను అధికారులు నిలిపివేశారు. ఈ విషయం తెలుసుకున్న అతను అధికారులు, ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరిగి పింఛన్‌ను పునరుద్ధరించాలని వేడుకున్నాడు. అయినా ఎవరూ కనికరించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఎండు మంచం పట్టి గురువారం మృతి చెందినట్టు అతని భార్య దాలమ్మ రోదిస్తూ చెప్పింది. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఎస్ఆర్డీహెచ్ కమిటీ పేరుతో నిరు పేదలమైన తమలాంటి వారి పింఛన్ రద్దు చేయడం దారుణమని వాపోయింది. సర్కార్ నిర్లక్ష్యం కారణంగానే తన భర్త మృతి చెందాడని, పాలకులే ఆదుకోవాలని డిమాండ్ చేసింది. మృతుడు ఎండుకు భార్త దాలమ్మ, కుమారుడు రాంబాబు, కుమార్తె విజయలక్ష్మిలు ఉన్నారు. -
పెన్షనర్ల గుండెల్లో టెన్షన్
* ఏపీలో లక్షల పింఛన్లపై వేలాడుతున్న వడపోత * కత్తి కుంటిసాకులు చూపుతూ వేటేస్తున్న అధికారులు ఈ ఫొటోలోని బడ్నాన అప్పలస్వామి, నరసమ్మలు దంపతులు. అప్పలస్వామి వయసు 70 ఏళ్లు, నరసమ్మ వయసు 66 సంవత్సరాలు. వీరిది విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం ఎరకందొరవలస గ్రామం. నిరుపేదలైన వీరికి గత ఏడాది రచ్చబండలో రేషన్‌కార్డు ఇచ్చారు. అప్పటి నుంచీ వీరికి వృద్ధాప్య పింఛను వస్తోంది. తాజాగా సర్కారు చేపట్టిన తనిఖీల్లో భాగంగా అధికారులు ఈ దంపతులకు పింఛను కత్తిరించేశారు. వారు కాళ్లావేళ్లా పడ్డా.. స్థానిక నేతలు బతిమిలాడినా కనికరం చూపలేదు. ఇంతకీ పింఛను కత్తిరించటానికి అధికారులు చూపిన కారణం.. పండు ముదుసలులైన వీరిద్దరి ఫొటోలతో ఉన్న రేషన్ కార్డులో వారి వయసు 25 ఏళ్లు, 22 ఏళ్లుగా నమోదై ఉండటమే! రేషన్ కార్డు నమోదులో ప్రభుత్వ సిబ్బంది చేసిన తప్పును సాకుగా చూపి.. పండు ముదుసలులు కళ్లెదుట కనబడుతున్నా పింఛన్లు కత్తిరించేశారు!! ఈ ఒక్క ఉదాహరణ చాలు.. సామాజిక పింఛన్లను ఏరివేయటానికి సర్కారు వారు ఎంతగా తహతహలాడుతున్నారో తెలియడానికి!!! సాక్షి, హైదరాబాద్: ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కున్నట్టుగా ఉంది ఆంధ్రప్రదేశ్ సర్కారు తీరు! నెలకు రూ.వెయ్యి చొప్పున పింఛన్లు ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం 13.18 లక్షల మంది పింఛనుదారుల బతుకు ఆధారాన్ని ప్రశ్నార్థకంగా మార్చింది. ఎన్నికల సమయంలో వృద్ధాప్య, వితంతు పెన్షన్‌దారులకు రూ. 1,000 చొప్పున, వికలాంగులకు రూ. 1,500 చొప్పున పింఛన్లు పంపిణీ చేస్తామని హామీలు గుప్పించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత పెరగాల్సిన పింఛనుదారుల సంఖ్యను కుదిస్తోంది. గురువారం గాంధీ జయంతి సందర్భంగా ఆర్భాటంగా పెంచిన పింఛన్లు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమవుతుండగా.. రాష్ట్రంలో 13.18 లక్షల మంది పింఛనుదారుల భవితవ్యం గందరగోళంగా మారింది. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 43.12 లక్షల పింఛన్లు ఉండగా.. సెప్టెంబరు 18 నుంచి 25వ తేదీ లోపు పరిశీలించిన గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలు అనర్హత పేరుతో 3.34 లక్షల పింఛన్లను తొలగించారు. అలాగే ఆధార్ కార్డు లేదన్న కారణంగా మరో 1.63 లక్షల ఫించన్లను పక్కనపెట్టారు. ఇవికాకుండా.. సామాజిక పింఛన్లకు ఇంకా 2.61 లక్షల మంది అర్హులు ఉన్నారని గత ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమం సందర్భంగా గుర్తించిన దరఖాస్తులను బుట్టదాఖలు చేసింది. ఇక తాజా కసరత్తులో గ్రామ, మండల కమిటీలకు 5.60 లక్షల మంది పింఛన్ల కోసం కొత్తగా దరఖాస్తులు చేసుకున్నారు. రీవెరిఫికేషన్ పేరుతో ఈ దరఖాస్తులను కూడా పక్కనపెట్టినట్టు తెలుస్తోంది. అయితే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పింఛన్లు ఇవ్వాలా? వద్దా? అన్నది తేల్చలేదు. సర్కారు సాయంతో ఇల్లు కట్టుకున్నా కట్... 2007లో ప్రభుత్వం మంజూరు చేసిన పక్కా భవనాలు నిర్మించుకున్న వారిని సైతం జాబితా నుంచి అనర్హులుగా ప్రకటించారు. తామేమీ సొంతంగా గూడు నిర్మించుకోలేదని ప్రభుత్వ సహాయంతో నిర్మించిన గృహాలను సైతం ఓ కారణంగా చూపి పింఛన్లు రద్దు చేయడమేమిటని గ్రామసభల్లో ప్రశ్నించినప్పటికీ పట్టించుకోలేదు. ఇక.. అర్హులై ఉండి ఇన్నాళ్ళూ పెన్షన్ దక్కక బాధపడే వారంతా కొత్తగా దరఖాస్తు చేసుకుంటే పింఛన్ అందిస్తామని ప్రగల్భాలు పలికిన సర్కారు పెద్దలు.. అలా దరఖాస్తు చేసుకున్న వారిలో ఒక్కరికి కూడా పింఛన్ల జాతరలో పింఛన్ అందివ్వకపోవడం గమనార్హం. కాగా, వేలిముద్రలతో సరిపోల్చుతూ ఐదారేళ్లుగా పింఛన్ పొందుతున్నప్పటికీ ఆధార్ లేదన్న కారణంగా 1.63 లక్షల పింఛన్లను పక్కనపెట్టారు. నిరంతరం వేలాడనున్న వడపోత కత్తి... పింఛన్ల భారాన్ని తగ్గించుకోవడానికి వడపోత కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. రాష్ట్రంలో కొన్నేళ్ళుగా పింఛన్లు తీసుకుంటున్న 43.12 లక్షల మందిలో అనర్హులుగా 4.97 లక్షల మందిని తేల్చారు. ప్రస్తుతం ఏరివేత అనంతరం 38.15 లక్షల మందే అర్హులుగా తేల్చారు. ఈ జాబితా వడపోతను నిరంతరం కొనసాగించాలని సర్కారు నిర్ణయించినట్లు తెలుస్తోంది. తాజాగా కమిటీలు ధ్రువీకరించిన అర్హుల జాబి తాను థర్డ్ పార్టీతో మరోసారి పరిశీలింపజేసే అంశం పరిశీలనలో ఉన్నట్లు ఓ మంత్రి వెల్లడిం చారు. సానుభూతితోనూ, మానవతా థృ క్పథం తో అందించే పింఛన్ల జాబితాపైనా ఇకపై ఆంక్ష ల పర్వం కొనసాగించాలని నిర్ణయించారు. నామమాత్ర కేటాయింపులతో ఎలా? ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సామాజిక భద్రత కింద బడ్జెట్లో రూ. 1,338 కోట్లు మాత్ర మే కేటాయించారు. గడిచిన 5 నెలల కాలంలో 43.12 లక్షల మందికి పింఛన్ల కోసం ప్రతి నెలా రూ. 130 కోట్ల చొప్పున చెల్లించారు. ఆ లెక్కన ఆ లెక్కన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రూ.650 కోట్లు అవు తున్నాయి. సెప్టెంబర్ నుంచి ఇక మిగిలిన ఏడు నెలల కాలానికి ప్రభుత్వం తేల్చిన 38.15లక్షల మందికి (మెజారిటీ పింఛన్లు రూ. 1,000 చొప్పు న, మరికొన్ని రూ. 1,500 చొప్పున) పింఛన్లు ఇవ్వాలన్నా నెలకు దాదాపు రూ. 450 కోట్ల చొప్పున రూ. 3,080 కోట్లు కావాలి. గడిచిన ఐదు నెలల్లో చెల్లించిన మొత్తా న్ని కలిపితే కనీ సంగా రూ. 3,730 కోట్లు అవసరం. బడ్జెట్లో రూ. 3,292 కోట్ల లోటు చూపిస్తున్న ప్రభుత్వం ఆ నిధులను ఏ విధంగా సమకూర్చుతుందన్న విషయాన్ని చెప్పడం లేదు. ఈ లెక్కన ప్రస్తుత నిధులతో మూడో నెలలో పెంచిన పింఛన్ ఎలా చెల్లిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. పింఛన్ల కత్తిరింపు అమానవీయం: వైఎస్సార్సీపీ పింఛన్లు పెంచుతామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇపుడు కోతలు విధించడం అమానవీయం, అమానుషమని వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్టోబర్ 2 నుంచి పిం ఛన్ల మొత్తం పెరుగుతుందని ఆశతో ఎదురు చూసిన లక్షలాది వృద్ధులు, వితంతువుల పింఛన్లను అడ్డంగా క త్తిరించి వారి ఉసురు పోసుకుంటున్నారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు ఒక ప్రకటనలో విమర్శించారు. ఓవైపు కోత లు పెడుతూ మరోవైపు ‘భరోసా’ ఇస్తున్నామ ని గొప్పలు చెప్పుకుంటారా? అని ప్రశ్నిం చారు. ఆధార్ కార్డు లేదన్న కారణంగా 1.7 లక్షలు, అనర్హులంటూ 3.5 లక్షల మంది పింఛన్లకు కోత విధించారని విమర్శించారు. వృద్ధులకు, వితంతువులకు సామాజిక భద్రతను కల్పించే ఈ పింఛన్లను సంతృప్తస్థాయిలో ఇస్తారా? ఇవ్వరా? అని నిలదీశారు. -
పరకాలకు చెవిరెడ్డి సవాల్!
తిరుపతి: ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కిరాయి మనిషని వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి విమర్శించారు. భార్య పేరు చెప్పుకొని పదవి పొందారన్నారు. గతంలో చంద్రబాబుపై చేసిన ఆరోపణలకు ఇప్పుడు పరకాల కట్టుబడి ఉన్నారా? అని అడిగారు. డబ్బు కోసం పాలకొల్లులో ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసిన కేసులో పరకాల జైలుకు వెళ్లారన్నారు. వైఎస్ఆర్ సిపిని ఎదుర్కోలేక పరకాల శిఖండిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తన తండ్రి వృద్ధాప్య పింఛన్‌పై బహిరంగ చర్చకు పరకాల సిద్ధమేనా? అని చెవిరెడ్డి సవాల్ విసిరారు. తన తండ్రి పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఆధారాలు ఉన్నాయా? అని అడిగారు. తన తండ్రి ఎక్కడైనా ఒక రూపాయి పెన్షన్ తీసుకున్నట్లు చెప్పగలరా? అని అడిగారు. తన తండ్రికి పెన్షన్ మంజూరులో ఆయన ప్రమేయంలేదని సంబంధిత అధికారులు రాతపూర్వకంగా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇది ఖచ్చితంగా తన తండ్రి పేరుతో సృష్టించిన దొంగ కార్డని ఆయన అన్నారు. ఇవన్నీ చంద్రబాబు సొంత నియోజకవర్గం నుంచి గెలిచినందువల్ల ఈర్ష్య, అసూయలతో చేస్తున్న కుట్రలు, కుతంత్రాలే అన్నారు. తాను పోరాటాల ద్వారా రాజకీయంగా ఎదిగానని చెప్పారు. పరకాల ప్రభాకర్లాగా పైరవీలతో రాజకీయాలు చేసేవాడిని కాదని చెవిరెడ్డి చెప్పారు. ** -
పెన్షన్‌దారుల కోసం 19, 20 తేదీల్లో ప్రత్యేక సర్వే
-
80% వైకల్యం ఉంటేనే రూ.1500 పింఛన్
సాక్షి, హైదరాబాద్: వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు అందజేసే నెలవారీ పింఛన్‌ను పెంచుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వృద్ధులు, వితంతువు, చేనేతలకు చెల్లించే పింఛన్ వెయ్యి రూపాయలకు పెంచారు. 40 శాతం నుంచి 79 శాతం వరకు అంగకవైకల్యం ఉన్న వారికి వెయ్యి.. 80 శాతం, ఆపైన అంగవైకల్యం ఉండేవారికి 1,500 రూపాయలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు మొన్నటి ఎన్నికల ప్రచారం సందర్భంగా తమ పార్టీ అధికారంలోకి వస్తే పింఛన్లను పెంచుతామని ప్రకటన చేసి ఈ మేరకు తాను ప్రమాణస్వీకారం చేసే రోజు ఫైలు సంతకం చేశారు. అయితే ఎన్నికల సందర్భంగా వికలాంగులందరికీ రూ. 1500 చెల్లిస్తామని ప్రకటన చేసిన చంద్రబాబు తీరా అమలు విషయానికి వచ్చే సరికి ఆంక్షలు మొదలు పెట్టారు. ప్రభుత్వం విధించిన ఆంక్షల కారణంగా 40 నుంచి 79 శాతం అంగవైకల్యం ఉన్న వారు రూ.500 ఫించనును కోల్పోవాల్సి వస్తోంది. లబ్ధిదారులకు అక్టోబరులో జరిపే చెల్లింపు నుంచి పెరిగిన పింఛన్లు అమలులోకి వస్తాయని గ్రామీణాభివృద్ధి ఇన్‌ఛార్జి ముఖ్యకారదర్శి ఎస్పీ టక్కర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, వితంతవులు, చేనేతలకు రూ.200, 40 శాతం పైన అంగవైకల్యం ఉన్న వికలాంగులందరికీ రూ.500 పింఛన్ ఇస్తున్నారు.