
కోఠి మీ–సేవా కేంద్రంలో ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన వృద్ధులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్ అర్హత వయసును 57 ఏళ్లకు తగ్గించినా, దరఖాస్తుదారులకు మార్గదర్శకాలతో ఇబ్బందులు తప్పడం లేదు. తగ్గించిన అర్హత వయసుతో పింఛన్‌కు దర ఖాస్తు చేసుకునేందుకు గడువు మంగళవారంతో ముగియనుంది. వయసు ధ్రువీకరణకు మున్సిపల్ బర్త్ సర్టిఫికెట్, స్కూల్ టీసీ, ఓటర్ గుర్తింపు కార్డు ల్లో ఏదో ఒకటి జతచేయాలనేది నిబంధన. అయితే ఈ పత్రాలు లేని వారు తమ దరఖాస్తులను మీ–సే వా కేంద్రాల్లో అప్లోడ్ చేయలేకపోతున్నారు.
ఈ ప త్రాల్లో ఏదో ఒకటి ఉంటేనే దరఖాస్తు అప్‌లోడ్ అ య్యేలా అధికారులు ఏర్పాట్లు చేయడంతో లబ్ధిదా రులకు ఇబ్బందులు తప్పడంలేదు. గ్రామీణ ప్రాం తాల్లో చాలా మంది చదువుకోని వారే కావడంతో పుట్టిన ధ్రువీకరణపత్రం, టీసీలు లేవు. అలాంటి వారికి ఓటరు గుర్తింపు కార్డే ఆధారం. అయితే ప్రస్తు తం సంబంధిత వెబ్‌సైట్ నుంచి ఓటర్ గుర్తింపు కార్డు తీసుకునే వెసులుబాటు లేకపోవడం ఇబ్బందిగా మారింది. ఆ వెబ్‌సైట్‌ను నిలిపివేసినట్లు మీ–సేవ కేంద్రాల నిర్వాహకులు చెబుతుండటంతో దరఖాస్తుదారులు అయోమయంలో ఉన్నారు.
పింఛన్ల మార్గదర్శకాలివే...
►నిర్ణీత నమూనాకు అనుగుణంగా ఈ–సేవా/మీ–సేవా సెంటర్లలో దరఖాస్తు చేసుకోవాలి.
►అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు గడువు తేదీ ఆగస్టు 31.
►జీవో 75లో పొందుపరిచినట్లు.. మున్సిపల్ అధికారులు జారీచేసిన పుట్టినరోజు ధృవీకరణ పత్రం లేదా జనన, మరణాల రిజిస్ట్రార్ జారీచేసిన సర్టిఫికెట్ లేదా బర్త్‌డే సర్టిఫికెట్ జారీచేసే అధికారమున్న వారు ఇచ్చే పత్రం. (లేదా) స్కూల్ నుంచి పాసై వచ్చేటప్పుడిచ్చే టీసీ/ సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్/ స్కూళ్లు, గుర్తింపు పొందిన బోర్డులు జారీ చేసే సర్టిఫికెట్/ గుర్తింపు పొందిన విద్యాసంస్థలిచ్చే సర్టిఫికెట్. (లేదా) ఓటర్ల జాబితా/ ఓటర్ ఐడీ కార్డు.
►2014, నవంబర్‌లో జారీ చేసిన జీవో 17, జీవో 23 ప్రకారం అర్హతల వర్తింపు.
నాకు పింఛన్ ఇప్పించండి
నాకు ఇల్లు లేదు. అద్దె ఇంట్లో ఉంటున్నా. నా వయసు 70 ఏళ్లు. ఆసరా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవడం కోసం మీ–సేవ కేంద్రానికి వెళ్లా. ఎన్నికల గుర్తింపు కార్డు అడిగారు. అది నా దగ్గర లేకపోవడంతో దరఖాస్తు చేయలేకపోయా. నా భార్య 12 ఏళ్ల క్రితం, నా కొడుకు ఇటీవల చనిపోయారు. నా బిడ్డ 19 ఏళ్ల మౌనికతో కలిసి జీవిస్తున్నా. నాకు పింఛన్ ఇప్పించాలని సర్కార్‌ను విజ్ఞప్తి చేస్తున్నా.
– ఆకుల విష్ణుమూర్తి, రాయికల్, జగిత్యాల జిల్లా
ఓటరు కార్డు పోయింది
నేను గొర్లు కాసుకుంటూ జీవితం గడుపుతున్నా. నాకు 70 ఏళ్లు దాటాయి. ఓటరు గుర్తింపు కార్డు పోయింది. మీ–సేవ కేంద్రానికి వెళితే.. ఓటరు గుర్తింపు కార్డు లేకుంటే ఆసరా పింఛన్ రాదని చెబుతున్నారు. సీఎం కేసీఆర్ పట్టించుకుని పింఛన్ ఇప్పించాలి. – లక్కం కిష్టయ్యయాదవ్
వెబ్‌సైట్ నిలిచిపోయింది
ఆసరా పింఛన్ కోసం ఓటరు గుర్తింపు కార్డు తప్పనిసరి అని ప్ర భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, ఓటర్ గుర్తింపు కార్డు డౌన్‌లోడ్ చేసుకునే వెబ్‌సైట్ నిలిచిపోయింది. దరఖాస్తు చేసుకునేందుకు వచ్చినవారు కార్డు డౌన్‌లోడ్ కాకపోవడంతో నిరాశతో వెనుదిరిగిపోతున్నారు.
– షబీల్, మీ–సేవ నిర్వాహకుడు