
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి నియోజకవర్గానికో కోఆర్డినేషన్ ఆఫీసర్‌ను నియమిం చేలా పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రతి పార్టీ అభ్యర్థికి సంబం ధించిన ప్రచార వాహనాలు, మైకులు, సభలు, ర్యాలీలు తదితర కార్యక్రమాలకు సంబంధించి ముందస్తుగా తీసుకోవాల్సిన అనుమతులను కోఆర్డినేషన్ అధికారులు ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్ జారీ చేసే మార్గదర్శకాల ఆధారంగా కోఆర్డినేషన్ అధికారులు చర్యలు చేపట్టనున్నారు.
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొం డ కమిషనరేట్లలో నియోజకవర్గానికి ఒక ఏసీపీకి బాధ్యతలు అప్పగించగా, జిల్లాల్లోని ఏసీపీ అధికారులకు రెండు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించేలా కార్యాచరణ రూపొందించారు. ఈ అధికారులు వారి వారి నియోజకవర్గాల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించడం, నేరచరితులను బైండోవర్ చేయించడం, నిఘా విభాగం, ఎన్నికల కమిషన్ ఆదేశాలను పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడటం వంటి బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు..
ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు మాత్రమే ప్రచారం నిర్వహించాలి. నిబంధనలు ఉల్లంఘి స్తే కోఆర్డినేషన్ అధికారులు కేసుల నమోదుకు సిఫారస్ చేస్తారు. ప్రత్యర్థులను గానీ, ఇతరుల ను ఉద్దేశించి గానీ వ్యక్తిగత అంశాలను ప్రస్తావిం చరాదు. అలా చేస్తే ఎన్నికల కమిషన్ ఆదేశాలతో కేసులు నమోదు చేస్తారు.