జేసీబీ నడిపి.. సాధారణ కూలీగా డిప్యూటీ స్పీకర్‌ | Padma Devender Reddy work on jcb for mission kakatiya | Sakshi
Sakshi News home page

జేసీబీ నడిపి.. సాధారణ కూలీగా డిప్యూటీ స్పీకర్‌

Published Fri, May 26 2017 8:24 PM | Last Updated on Sat, Aug 11 2018 8:09 PM

జేసీబీ నడిపి.. సాధారణ కూలీగా డిప్యూటీ స్పీకర్‌ - Sakshi

జేసీబీ నడిపి.. సాధారణ కూలీగా డిప్యూటీ స్పీకర్‌

మెదక్‌: తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి శుక్రవారం మెదక్ పట్టణంలో పర్యటించారు. మధ్యాహ్నం 12:30 గంటలకు పట్టణంలోని నాయకుని చెరువులో మిషన్ కాకతీయ పనులు ప్రారంభించారు. ఈ పనుల్లో భాగంగా మహిళా నేత పద్మాదేవేందర్ రెడ్డి స్వయంగా జేసీబీ నడిపి పనులకు శ్రీకారం చుట్టడం విశేషం. పలుగు, పార చేతపట్టి సాధారణ కూలీగా మారిపోయి మట్టిని ఎత్తి పోశారు.

మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రెండు గంటలవరకు పట్టణంలోని బంగ్లా చెరువు, మల్లంచెరువులను డిప్యూటీ స్పీకర్ పరిశీలించారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కలెక్టరేట్ లో హరితహారంపై సమీక్ష నిర్వహించారు. అనంతరం మెదక్ పట్టణంలో జరిగిన పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు.



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement