నిజామాబాద్: పార్లమెంట్ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఎన్నికలు ముగిసే వరకు రూ.50 వేలకు మించి నగదు ఉండ కూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో రూ.50 వేలకంటే నగదు తీసుకెళ్లాల్సిన పరిస్థితులు వస్తే అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల సమయం కావడంతో రహదారులపై పోలీసులు ప్రతీ వాహనం తనిఖీ చేస్తారు. ఆ సమయంలో ఒక వ్యక్తి వద్ద రూ.50 వేల కంటే ఎక్కువ నగదు ఉంటే అందుకు సంబంధించిన పత్రాలు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి.
ఏ బ్యాంకు నుంచి డ్రా చేశారు అనే రశీదులతో పాటు ఎప్పడు డ్రా చేశారనే పూర్తి వివరాలు కచ్చితంగా ఉండాలి. సరైన రశీదులు లేకుంటే సంబంధించిన నగదును సీజ్ చేసే అధికారం తనిఖీ చేసే అధికారులకు ఉంటుంది. డబ్బుకు సంబంధించిన ఆధారాలు చూపించి మళ్లీ తీసుకునే వెసులుబాటు కూడా ఉంది. అయితే రశీదులు వెంట పెట్టుకోవడం ద్వారా ఇబ్బంది తలెత్తకుండా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా బంగారు నగల వ్యాపారులు, ఇతర వ్యాపారుల నుంచి ఎవరైనా నగదురూపంలో కాకుండా బ్యాంక్ డీడీ, చెక్‌ల ద్వారా లావాదేవీలు కొనసాగిస్తే మంచిదని ఎన్నికల కమిషన్ సూచిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment