నగరంలో సీఎన్‌జీ, ఆటో గ్యాస్‌కు భారీగా డిమాండ్ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండడంతో కార్లు, ఆటోల్లో గ్యాస్ వాడకానికే నగరవాసులు మొగ్గు చూపుతున్నారు. కొందరు ఏకంగా వాహనాలకు అధికారిక గ్యాస్ ట్యాంకులు అమర్చుకుంటున్నారు. మరికొందరు గ్యాస్ వాహనాలనే కొనుగోలు చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్‌తో పోలిస్తే ధర తక్కువగా ఉండటమేగాక మైలేజీ అధికంగా వస్తుండటంతో గ్యాస్ వినియోగానికి డిమాండ్ పెరుగుతోంది. పెట్రోలు లీటర్ ధర రూ.79 ఉండగా...సీఎన్‌జీ కిలో రూ.52 ఉంది. ఆటో గ్యాస్ కిలో రూ.41.47 పైసలు ఉంది. ఇక మూడు ప్రధాన ఆయిల్ కంపెనీలకు చెందిన బంకులతోపాటు టోటల్, రిలయన్స్ బంకుల్లో సైతం గ్యాస్ విక్రయిస్తున్నారు. ప్రస్తుతం 1.40 లక్షల వాహనాలు సీన్‌జీ, ఆటో గ్యాస్, లిక్విడ్, ఎల్పీజీ గ్యాస్‌ను వినియోగిస్తున్నాయి. ఇవి మరింత పెరిగే అవకాశం ఉంది.
సాక్షి,సిటీబ్యూరో: పెట్రోల్ ధరలు ఆకాశాన్నం టుతుండటంతో నాలుగు చక్రాల వాహనదారులు గ్యాస్ వినియోగంపై ఆసక్తి చూపుతున్నారు. కొందరు అధికారికంగా అనుమతి తీసుకొని వాహనాల ట్యాంకులు ఏర్పాటు చేసుకుంటుండగా మరి కొందరు అనధికారికంగా మార్పిడి చేసుకుంటున్నారు. దీంతో హైదరాబాద్ మహా నగరంలో నేచురల్, లిక్విడ్ గ్యాస్‌కు డిమాండ్ పెరుగుతోంది.పెట్రోల్, డీజిల్‌తో పొలిస్తే ధర తక్కువగా ఉండటమేగాక మైలేజీ అధికంగా వస్తుండటంతో గ్యాస్ వినియోగానికి డిమాండ్ పెరుగుతోంది. రోజువారి సవరణల నేపథ్యంలో పెట్రోల్, డీసెల్ ధరలు అదుపు తప్పడంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్ బంకులతోపాటు ఆటో గ్యాస్, సీఎన్‌జీ, లిక్విడ్ గ్యాస్ కేంద్రాలు ఉన్నాయి. నగర వ్యాప్తంగా 460 పైగా పెట్రోల్ బంకులు ఉండగా, అందులో 95 స్టేషన్లలో గ్యాస్ పంపులు కూడా కొనసాగుతున్నాయి. మరో ఇరవై ఐదు కేంద్రాలో నేచురల్ గ్యాస్ కేంద్రాలు నడుస్తున్నాయి. మూడు ప్రధాన ఆయిల్ కంపెనీలకు చెందిన బంకులతోపాటు టోటల్, రిలయన్స్ బంకుల్లో సైతం గ్యాస్ విక్రయిస్తున్నారు.
ఆర కోటికి పైగా..
మహా నగరంలో వాహనాల సంఖ్య అక్షరాల అర కోటి దాటింది. ఇందులో 20 లక్షల వరకు మూడు, నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయి. ప్రస్తుతం 1.40 లక్షల వాహనాలు సీన్‌జీ,ఆటో గ్యాస్,లిక్విడ్, ఎల్పీజీ గ్యాస్‌ను వినియోగిస్తున్నాయి. ఆటో గ్యాస్, లిక్విడ్ గ్యాస్‌కు కొరత లేనప్పటికీ సీ«ఎన్‌జీ గ్యాస్ సరైన సరఫరా లేకుండా పోయింది. సాధారణంగా గ్యాస్ స్టేషన్లకు ప్రతి రోజు 5000 ఆటోలు, 1000 వరకు నాలుగు చక్రాల వాహనాల తాకిడి ఉంటుంది. ఆటోల సీఎన్జీ కిట్స్ సామర్ధ్యం నాలుగున్నర కిలోలు కాగా నాలుగు కిలోల వరకు, కార్ల సామర్ధ్యం పది కిలోలు ఎనిమిది కిలోల వరకు గ్యాస్‌ను నింపుతారు. ఒక్కో స్టేషన్‌కు ప్రతి రో జూ 6వేల కిలోవరకు గ్యాస్ డిమాండ్ ఉంటుం ది. ప్రస్తుతం గ్యాస్ ధర నిలకడగా ఉండటం. రోజువారి సవరణ దీనికి వర్తించకపోవడంతో గ్యాస్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment