ప్రజలు సంఘటితమైతే విజయం తథ్యం: కోదండరాం
‘ప్రజాస్వామ్యం-సోషలిజం’పై అంతర్జాతీయ సదస్సు
హైదరాబాద్, న్యూస్‌లైన్: సాధారణ ప్రజలు సంఘటితమైతే విజయం సాధించవచ్చనేది తెలంగా ణ ఉద్యమం ద్వారా నిరూపితమైందని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు. రాజ్యమనేది గుప్పెడు మంది చేతు ల్లో ఉండరాదని, ప్రజలందరి వికాసానికి ఉపయోగపడేలా ఉండాలని అన్నారు. రాజ్యం కొద్దిమంది ప్రయోజనాల కోసం పని చేయ డం వల్లనే తెలంగాణ ఉద్యమం పుట్టిందని పేర్కొన్నారు. సోమవారం తెలంగాణ విద్యావంతుల వేదిక, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ఆధ్వర్యంలో నగరంలోని రెండు వేర్వేరు ప్రాం తాల్లో.. ‘ప్రజాస్వామ్యం-సోషలిజం, 21వ శతాబ్దంలో దిశానిర్దేశం’ అనే అంశంపై జరిగి న సదస్సుల్లో ఆయన మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమం ఏదో ఒక ప్రాంతానికి వ్యతిరేకంగా కాకుండా కేవలం కొందరు దోపిడీదారులకు వ్యతిరేకంగా మాత్రమే జరిగిందన్నారు. ఇష్టమొచ్చినట్లుగా ప్రభుత్వ నిధులు, వనరులను కొల్లగొట్టడం వల్లనే ఉద్యమం చేశామన్నారు. సీపీఐ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ తెలంగాణా అభివృద్ధికి అన్ని పక్షాలు చిత్తశుద్దితో కృషి చేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మాట్లాడుతూ సోషలిస్టు ప్రభుత్వం ఏర్పడితేనే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సరికొత్తగా తీర్చిదిద్దాలని ప్రముఖ ఆర్థికవేత్త సి.హెచ్.హనుమంతరావు కోరారు. తెలంగాణ పునర్నిర్మాణంలో దళితులు, బహుజనులకు సముచిత స్థానం కల్పించాలని టీ జాక్ నేత మల్లేపల్లి లక్ష్మయ్య కోరారు. ఎమ్మెల్సీ అమీన్ జాఫ్రీ, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి, సియాసత్ సంపాదకులు జాహెద్ ఆలీఖాన్ ఫ్రొఫెసర్ రమామేల్కొటే, వెనిజులా, బొలీవియూ, ట్యునీషియూ దేశాల ప్రతినిధులు ఈ సదస్సుల్లో పాల్గొన్నారు.