కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీ నాలుగో యూనిట్ లో సాంకేతిక లోపం కారణంగా విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.
రామగుండం: కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీ నాలుగో యూనిట్ లో సాంకేతిక లోపం కారణంగా విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో సోమవారం ఉదయం 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అధికారులు వెంటనే మరమ్మతులు ప్రారంభించారు. విద్యుత్ ఉత్పత్తిని పునరుద్దరిస్తామని అధికారులు తెలిపారు.