వినాయక పూజలో పీవీ సింధు
మణికొండ: బ్యాడ్మింటన్ ప్రపంచ విజేత, అర్జున అవార్డు గ్రహీత పీవీ సింధు మంగళవారం రాత్రి మణికొండ పంచవటికాలనీలో జరిగిన వినాయక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమె తల్లిదండ్రులు పీవీ రమణ, విజయలతో పాటు వచ్చిన ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమెకు మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని ఆల్‌కాలనీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు డి.సీతారాం, పంచవటి కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు భీంరెడ్డిలతో పాటు నాయకులు వారిని శాలువాతో సత్కరించి మెమోంటోను అందజేశారు. రాబోయే ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని సాధించాలని వారంతా ఆకాంక్షించారు. ఆమెతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు కాలనీ వాసులు పోటీ పడ్డారు. కార్యక్రమంలో మణికొండ మాజీ సర్పంచ్ కె.నరేందర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఎం.రాఘవరెడ్డిలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment