రాజీవ్ సేవలను ప్రచారం చేయాలి
రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు
ఖమ్మం: భారతదేశాన్ని శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చేసిన మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ సేవలను దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 21న ఖమ్మంలో ఆవిష్కరించే రాజీవ్‌గాంధీ కాంస్య విగ్రహాన్ని గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం డీసీసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. రాజీవ్‌గాంధీ భారత ప్రధానిగా పనిచేసిన కాలం స్వర్ణయుగం అన్నారు. టెలీకం, శాస్త్రీయ రంగంలో ప్రపంచదేశాల్లోనే భారత్ అగ్రగామిగా నిలిచిందన్నారు.
ఆయన కాంస్య విగ్రహాలను తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఏర్పాటుచేస్తామని చెప్పారు. ఖమ్మంలో 21న చేపట్టే విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పక్షనాయకుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నాయకులు కొప్పుల రాజు, సుఖేందర్‌రెడ్డి, నంది ఎల్ల య్య హాజరవుతారని తెలిపారు. మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ యువతకు స్ఫూర్తిదాతగా నిలిచిన రాజీవ్‌గాంధీ సేవలను కొనియాడాల్సిన అవస రం ఉందన్నారు.
ఖమ్మం ఎమ్మెల్యే పువ్వా డ అజయ్‌కుమార్ మాట్లాడుతూ వి ద్య, వైజ్ఞానిక రంగాల్లో రాజీవ్‌గాంధీ తీసుకున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు కొత్తా సీతారాములు, ఐతం సత్యం, శీలంశెట్టి వీరభద్రం, శేఖర్, బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు.