డీసీసీబీల్లో నోట్ల మార్పిడి బంద్
• పాత నోట్ల జమను నిలిపివేస్తూ ఆర్‌బీఐ ఆదేశాలు..
• రైతుల పాట్లు
సాక్షి, హైదరాబాద్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లల్లో పాత పెద్ద నోట్ల మార్పిడిని నిలిపివేస్తూ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఖాతాల్లో ఇప్పటికే ఉన్న సొమ్మును విత్‌డ్రా చేసుకోవడానికి మాత్రం అవకాశం కల్పించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డీసీసీబీల్లో రూ.500, రూ.వెరుు్య నోట్ల డిపాజిట్లను, మార్పిడి ప్రక్రియను నిలిపేశ ారు. ‘ఇక్కడ పెద్ద నోట్ల మార్పిడికి అవకాశం లేదు’ అంటూ బ్రాంచీల ముందు బోర్డులు పెట్టారు.
ఆర్బీఐ అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. తమ వద్ద ఉన్న పాత పెద్ద నోట్లను మార్చుకుని.. కొత్త నోట్లతో విత్తనాలు, ఎరువులు, ఇతర వస్తువులు కొనుక్కోవాల్సి ఉందని రైతులు పేర్కొంటున్నారు. ఆర్బీఐ నిర్ణయాన్ని సమీక్షించాలని, పెద్ద నోట్ల మార్పిడిని కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్(టెస్కాబ్) అధ్యక్షు డు కొండూరు రవీందర్‌రావు మంగళవారం రిజర్వుబ్యాంక్ గవర్నర్‌కు, కేంద్ర ఆర్థిక మంత్రి, సీఎంకు లేఖలు రాశారు. రిజర్వు బ్యాంకు నిర్ణయంతో రైతులు అనేక చోట్ల ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారన్నారు.
12 లక్షల మంది రైతులకు ఇబ్బంది...
స్కాబ్ ఆధ్వర్యంలోని 9 డీసీసీబీల పరిధిలో 272 బ్రాంచీలున్నారుు. వాటిలో 12 లక్షల మంది రైతులకు ఖాతాలున్నారుు. రైతులంద రికీ కలిపి మొత్తంగా రూ.4 వేల కోట్ల వరకు డిపాజిట్లు కూడా ఉన్నారుు. ప్రస్తుతం రబీ సీజన్ నడుస్తోంది. కీలకమైన ఈ సమయం లో చాలా మంది రైతులు బ్యాంకుల నుంచి, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి రుణాలు తెచ్చుకున్నారు. అరుుతే ఆ సొమ్మంతా పాత రూ.500, రూ.వెరుు్య కరెన్సీ నోట్ల రూపంలో ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నా రు. ‘‘సోమవారం వరకు పాత నోట్ల మార్పిడి లేదా జమ చేసి కొత్త నోట్లు తీసుకునే సదుపాయం సహకార బ్యాంకుల్లో ఉండేది.
దీనిని నిలిపేస్తూ రిజర్వు బ్యాంకు నిర్ణయం తీసుకుంది. ఎందుకీ నిర్ణయం తీసుకున్నారో అర్థంకావడం లేదు..’’ అని టెస్కాబ్ ఎండీ మురళీధర్ పేర్కొన్నారు. బ్యాంకుల నుంచి రూ.24 వేలు విత్‌డ్రా చేసుకునే సదుపాయం మాత్రం కొనసాగుతుందని చెప్పారు. సోమ వారం నాటికి సహకార బ్యాంకుల్లో రూ.350 కోట్ల పాత నోట్లను రైతులు జమ చేశారని, రూ.40కోట్ల మేరకు కొత్త నోట్లను అందజేశా మన్నారు. అరుుతే టెస్కాబ్ పరిధిలో హైదరాబాద్‌లోని 35 బ్రాంచీల్లో మాత్రం యథావిథిగా రద్దయిన పెద్ద నోట్ల మార్పిడి కొనసాగుతుందని వెల్లడించారు.
రాజకీయ ప్రమేయం?
రిజర్వుబ్యాంకు దేశవ్యాప్తంగా డీసీసీబీ బ్రాంచీల్లో పాత నోట్ల మార్పిడి నిలిపివే యడానికి రాజకీయ నేతలు, వారి ప్రతిని ధుల వ్యవహారమే కారణమనే అభిప్రా యాలు వ్యక్తమవుతున్నారుు. డీసీసీబీల కు అధ్యక్షులు, డెరైక్టర్లుగా ఉండేదంతా రాజకీయ నేతలే. వారి ద్వారా నల్లధనం రైతుల పేరుతో మార్పిడి జరుగుతోందనే ఉద్దేశంతో రిజర్వు బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు.