ప్రాంతీయ వైద్య, ఆరోగ్యశాఖలో సీనియారిటీ లొల్లి | Regional medical, health care seniority | Sakshi
Sakshi News home page

ప్రాంతీయ వైద్య, ఆరోగ్యశాఖలో సీనియారిటీ లొల్లి

Published Wed, Oct 29 2014 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 3:30 PM

ప్రాంతీయ వైద్య, ఆరోగ్యశాఖలో సీనియారిటీ లొల్లి

ప్రాంతీయ వైద్య, ఆరోగ్యశాఖలో సీనియారిటీ లొల్లి

11 రోజులుగా ఓపెన్ కాని ఈ-మెయిల్ జాబితా
ఐదో జోన్‌లో పదోన్నతులు, బదిలీల గందరగోళం
{పాంతీయ వైద్య,ఆరోగ్య సిబ్బంది
తీరుపై అనుమానాలు

 
 పదేళ్ల నుంచి  ఇదే గోస..

 నా పేరు ఎస్.అమ్మాని. మాది ఖమ్మం జిల్లా కొత్తగూడెం. నేను అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్‌లో పనిచేస్తున్నాను. నేను ఏఎన్‌ఎం అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలిగా కూడా పనిచేస్తున్నాను. అధికారులు సీనియారిటీ జాబితాను ఆన్‌లైన్‌లో పెట్టామని ప్రకటించారు. ఓపెన్ కాకపోవడంతో మంగళవారం ఆర్డీ కార్యాలయానికి వచ్చాను. దాదాపు 150 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాను. డీఎంహెచ్‌వో కార్యాలయానికి వచ్చిన జాబితాకు ఆర్డీ కార్యాలయం విడుదల చేసిన జాబితాకు చాలా వ్యత్యాసం ఉంది. పదేళ్ల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
 
 హన్మకొండ/ఎంజీఎం : వివాదాలకు కేంద్రబిందువైన ప్రాంతీయ వైద్య, ఆరోగ్యశాఖ తాజాగా సీనియారిటీ జాబితా రూపకల్పన విషయంలోనూ తన తీరును కొనసాగిస్తోంది. ఉద్యోగులకు సీనియారిటీ జాబితాను అందించడంలో ప్రాంతీయ వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు, వరంగల్ కార్యాలయ సిబ్బంది అనుసరించిన విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఏ  ప్రభుత్వ విభాగం అనుసరించని విధంగా ఉద్యోగుల సీనియారిటీ జాబితాను ఈ-మెయిల్‌లో పెట్టడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలోని వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో 28 విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సీనియారిటీ ప్రతిపాదికన త్వరలో పదోన్నతులు, బదిలీలు చేపట్టాల్సి ఉంది. ఇందులో భాగంగా ప్రాంతీయ వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు, వరంగల్ కార్యాలయ ఉద్యోగులు సీనియారిటీ జాబితాను రూపొందించా రు. ఈ జాబితాను  టఛీఝజిటట్ఛజీౌటజ్టీడజీట్ట ఃడ్చజిౌౌ.ఛిౌఝ పేరుతో క్రియేట్ చేసిన ఈ మెయిల్‌లో ఉంచారు.

ఉద్యోగులు దీన్ని ఓపెన్ చేసేందుకు ట్ఛజీౌటజ్టీడజీటౌ్ట్డ్ఛ5 అనే పాస్‌వర్డ్‌ను టైప్ చేయాలంటూ పేర్కొన్నారు. ఈ మెయిల్‌లో జాబితాను 2014 అక్టోబరు 19వ తేదీ నుంచి చూసుకోవచ్చని సెలవిచ్చారు. ఈ జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే అక్టోబరు 30లోగా తెలపాలని సూచించారు. కానీ.. ఈ మెరుుల్ ఓపెన్ కాకుండా సతారుుస్తుండడంతో వైద్య ఆరోగ్యశాఖ విభాగంలో డాక్టర్లు మొదలుకుని అటెండర్లు, స్వీపర్ల వరకు వేలాదిమంది ఉద్యోగులు సీనియూరిటీ జాబితా కోసం ఎదురు చూస్తున్నారు. వీరందరికీ ఒకే ఈ మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌ను అందుబాటులో ఉంచడమే సమస్యలకు దారితీసినట్లు తెలుస్తోంది.
 ఈ మెయిల్ లాక్
 తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో చాలామంది పదోన్నతులపై భారీ అంచనాలతో ఉన్నారు. ఐదు జిల్లాలో ఉన్న ఉద్యోగులు సీనియారిటీ జాబితా కోసం ఆన్‌లైన్ వైపునకు అడుగులేయడంతో సైట్ ఓపెన్ కావడానికి గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.  2014 అక్టోబరు 19వ తేదీ మధ్యాహ్నం నుంచి ఈ మెయిల్ అడ్రస్‌తో పాటు పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేశాక,  జిగ్‌జాగ్ పద్ధతిలో ఉండే ఇంగ్లిష్ పదాలు, అంకెల సమాహారం(క్యాప్చా) ఇమేజ్ ఎంటర్ చేయాలని సూచిస్తోంది. క్యాప్చాను ఎంటర్ చేసిన తర్వాత పాస్‌వర్డ్‌ను తప్పుగా ఎంటర్ చేసినందున ఈ మెయిల్ లాక్ అయినట్లుగా కంప్యూటర్‌పై డిస్‌ప్లే అవుతోంది. సుమారు 11 రోజులుగా ఇదే తంతు నిరాంటకంగా కొనసాగుతోంది. దీంతో సీనియారిటీ జాబితాను చూసుకోలేకపోవడంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదేం పారదర్శకత

ఐదో జోన్ పరిధిలో వైద్య, ఆరోగ్యశాఖ విభాగంలో చేపట్టే బదిలీలు, పదోన్నతుల విషయం ప్రతి యేడు వివాదంగా మారుతోంది. నచ్చిన చోటుకి బదిలీలు, చేతులు తడిపిన వారికి పదోన్నతులు ఇప్పిస్తామంటూ ఇక్కడి సిబ్బంది తెరచాటు వ్యవహారాలు నడిపిస్తున్నారంటూ  ఉద్యోగులు అనేక సార్లు పై అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గత ఏడాది ఏకంగా ఆర్డీ కార్యాలయం ఎదుట ధర్నాలు సైతం చేపట్టారు. దీంతో ఈ ఏడాది సీనియారిటీ జాబితా విషయంలో పారదర్శకతను పాటిస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే సీనియారిటీ జాబితాను అందరికీ ఒకేసారి అందుబాటులో ఉంచేందుకు ఈ మెయిల్ ఐడీ మార్గాన్ని ఎంచుకున్నారు. సైట్‌తోపాటు పాస్‌వర్డ్‌ను ప్రకటించడం వల్ల కొంత మంది టెక్నాలజీని ఉపయోగించి పాస్‌వర్డ్‌ను మార్చే ఆవకాశం ఉందని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. సీనియారిటీ జాబితాను పీడీఎఫ్ ఫార్మాట్‌లో రూపొందించి అధికారిక సైట్‌లో అందుబాటులో ఉంచకుండా.. ఈ మెయిల్ పద్ధతిని ఎంచుకోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో ఇక్కడి సిబ్బంది తమ పట్టు నిలుపుకునేందుకే ఈ ఎత్తుగడ వేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు

ప్రాంతీయ వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సీనియారిటీ జాబితాను ఆన్‌లైన్‌లో పెట్టారు. అది ఓపెన్ కాకపోవడంతో ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల ఉద్యోగులు వరంగల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అయితే జాబితాలో తప్పులు ఉంటే ఈ నెల 30వ తేదీలోగా తెలుపాలని అధికారులు పేర్కొన్నారు. జాబితా ఆన్‌లైన్‌లో ఓపెన్‌కాకపోవడం, సమయం దగ్గర పడుతుండడంతో ఆయా జిల్లాల ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులకు జాబితా చేరకపోవడంతో ఉద్యోగ సంఘాల నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement