రంగారెడ్డి జిల్లా ఘట్కేసరి మండలం జోడిమెట్లలోని డెక్కన్ గ్రామీణ బ్యాంక్ శాఖలో మంగళవారం దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు.
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఘట్కేసరి మండలం జోడిమెట్లలోని డెక్కన్ గ్రామీణ బ్యాంక్ శాఖలో మంగళవారం దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. గ్యాస్ కట్టర్ల సహయంతో లాకర్లు తెరచి బంగారు ఆభరణాలు, నగదు దోచుకుని ... ఉడాయించారు. ఈ రోజు ఉదయం భద్రత సిబ్బంది ఆ విషయాన్ని గమనించి పోలీసులకు, బ్యాంకు యాజమాన్యానికి సమాచారం అందించారు.
దీంతో పోలీసులు, అధికారులు బ్యాంకుకు చేరుకున్నారు. బ్యాంకులో చోరీ జరిగిన తీరును పోలీసులు పరిశీలిస్తున్నారు. చోరీపై భద్రత సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. లాకర్లల్లో భారీగా బంగారం, నగదు ఉన్నాయని... ఆ మొత్తం చోరీ అయిందని బ్యాంకు అధికారులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.